మెగా డాటర్ నిహారిక లీడ్ రోల్ లో రాహుల్ విజయ్ హీరోగా వస్తున్న సినిమాను ప్రణీత్ బ్రహ్మాండపల్లి డైరెక్ట్ చేశారు. నిహారికతో ఆల్రెడీ ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సీరీస్ తీసి మెప్పించిన ఈ దర్శకుడు సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. శ్యామలా యాంకరింగ్ లో వచ్చిన సూర్యకాంతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తప్పులు తడకలు చేసింది.


ఇంతకీ శ్యామలా ఏం చేసింది అంటే.. సినిమాలో ఓ పాత్ర చేసిన శివాజి రాజా ను మా ఎలక్షన్స్ లో విజయం సాధించినందుకు కంగ్రాట్స్ అని చెప్పింది. మా మాజీ అధ్యక్షుడు శివాజి రాజా.. మా అధ్యక్షుడిగా ఈసారి నరేష్ విజయం సాధించాడు. కాని శ్యామలా శివాజి రాజానే విన్ అయ్యాడని అనుకుంది.


మా విజేతగా నిలిచినందుకు కంగ్రాట్స్ అని శ్యామలా చెబితే దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక.. ఎలా మ్యానేజ్ చేయాలో తెలియక నా ప్యానెల్ లో కొంతమంది గెలిచారని అన్నాడు శివాజి రాజా. అయినా ఆగకుండా మీరు ముందుండి మీరు నడిపించారు కదండి అన్నది శ్యామలా. 


ఇండస్ట్రీలో యాంకర్ గా ఉంటూ కనీసం మా ఎన్నికల్లో విజేత ఎవరన్నది తెలుసుకోకపోవడం శ్యామలా చేసిన పెద్ద పొరపాటు. అసలే ఓడిన పరాభవంతో ఉన్న శివాజి రాజాని గుచ్చి గుచ్చి విజేత మీరే అనడంపై ఆయన చాలా సీరియస్ అయ్యాడట. ఈవెంట్ లో మిగతా వారంతా శ్యామలా కామెంట్స్ కు షాక్ అయ్యారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: