సిని నటుడిగా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. ఆ క్రేజ్ తోనే జనసేన పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేసేందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్. ఆయన స్పీచ్ అర్ధం కాకున్నా ఆయన వెంట నడిచే జన సైనుకులు చాలా మందే ఉన్నారు. అయితే వారంతా ఎన్నికల్లో జనసేన వైపు ఉంటారా లేరా అన్నది తెలియాల్సి ఉంది.


ఇలాఉంటే నిన్న కృష్ణ జిల్లా ప్రచారంలో అంధ్రా వాళ్లు వెళ్తే తెలంగాణాలో కొడతారా.. తెలంగాణా ఏమన్నా పాకిస్తానా అన్న వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై పవన్ గురించి అసలు ప్రస్థావించని వారు కూడా పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఉదయం పవన్ కళ్యాన్ కు మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా సిని రచయిత చిన్ని కృష్ణ చేసిన సంచలన వ్యాఖ్యలు అందరికి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ గురించి చిన్ని కృష్ణ  రెండు సంవత్సరాల క్రితం మాట్లాడిన వీడియో :



తాను నోరు తెరిస్తే నవ రంధ్రాలు మూసుకోవాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు చిన్ని కృష్ణ. కాపు యువతని పవన్ తప్పుదారి పట్టిస్తున్నాడని అన్నారు. అయితే ఇదే చిన్ని కృష్ణ 2017లో ఓ ఇంటర్వ్యూలో 120 కోట్ల మంది భారతీయుల్లో పవన్ కళ్యాణ్ లాంటి క్యారక్టర్ చాలా తక్కువ మందికి ఉంటుందని అన్నారు. ఆయన్ను మదర్ థెరిసా, వివేకానంద, మహాత్మ గాంధితో పోల్చాడు.


అంతేకాదు ఆంధ్ర దేశంలోనే కాదు భారతదేశంలో ఓ ఐకాన్ పొలిటిషియన్ గా ఎదుగుతారని ఇది కచ్చితంగా జరుగుతుందని అప్పట్లో అన్నారు చిన్ని కృష్ణ. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా సెటిలర్స్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని.. కె.సి.ఆర్ తమకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారని ఈరోజు ప్రెస్ మీట్ లో అన్నారు చిన్ని కృష్ణ. మరి చిన్ని కృష్ణ సడెన్ ఎంట్రీ పవన్ పై విమర్శనాస్త్రాలు అందరికి షాక్ ఇస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: