సినీ నటులు రాజకీయాల్లోకి వెళ్లడం ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయమే..అని అందికీ తెలిసిందే.  అన్ని భాషల్లోని టాప్ హీరోలు, హీరోయిన్లు రాజకీయాల్లోకి వెళ్లారు.  కొంత మంది సొంత పార్టీలు పెట్టి మరీ రాజకీయలు నడిపారు. అలాంటి వారిలో నందమూరి తారక రామారావు, ఎంజీ రాంచందర్ లాంటి వారు ముఖ్యులు.  వీరి పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి హోదాలో పాలించారు.  ప్రస్తుతం దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తుంది.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ..ఇలీవల ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో రాంచరణ్ సరసన నటించబోతున్న ఆలియా భట్‌ రాజకీయాలపై సెస్సేషన్ కామెంట్స్ చేశారు. 


అంతే కాదు ఒకవేళ తాను రాజకీయాల్లోకి వస్తే..తన పార్టీ గుర్తు ఇదీ అని చెప్పారు.  తాజాగా కపిల్ శర్మ షోలో పాల్గొన్న ఆమె, ఇటీవలి కాలంలో తాను ఎక్కడికి వెళ్లినా రాజకీయాల ప్రస్తావన వస్తోందని, మీడియా కూడా ఇవే ప్రశ్నలు వేస్తోందని చెప్పిన ఆమె, 'ప్లేట్' గుర్తును ఇంతవరకూ ఎవరూ ఎంచుకోలేదని, జీవితంలో ప్లేట్ కు ఎంతో ప్రాధాన్యం ఉందని వ్యాఖ్యానించింది. వరుణ్‌ ధావన్‌ మాత్రం చెడ్డీ అని చెప్పారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయి ఒక్కసారిగా నవ్వడం ప్రారంభించారు.


 అభిషేక్‌ వర్మన్‌ దర్శకత్వం వహించిన ‘కళంక్’సినిమాలో ఆలియా భట్‌, వరుణ్‌ ధావన్‌, ఆదిత్యా రాయ్‌ కపూర్‌, సోనాక్షి సిన్హా, మాధురీ దీక్షిత్‌, సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రలు పోషించారు.  కరణ్‌ జోహార్‌ నిర్మాత. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఏప్రిల్‌ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: