ఎన్నికలు తరువాత మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్న పవన్ రెండురోజుల క్రితం హైదరాబాద్ తిరిగి రావడమే కాకుండా ఎన్నికల కోసం పెంచిన గెడ్డంను తీసివేసి క్లీన్ షేవ్ చేసుకుని తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల టెన్షన్ అయిపోవడంతో పాటు పవన్ తాను  వ్యక్తిగతంగా చెన్నైకి చెందిన ఒక మీడియా సంస్థతో తనకు తాను  చేయించుకున్న సర్వేలలో  గాజువాకలో తన గెలుపు ఖాయం అని రావడంతో ఇప్పడు ఇలా తన లుక్ ను మార్చుకుని రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం. 

ఇప్పుడు ఈ న్యూస్ ఇలా లీక్ కావడంతో పవన్ పై కొందరు కొత్త కామెంట్స్ చేస్తున్నారు. అమరావతిలో అందరికి అందుబాటులో ఉంటానని కొంతకాలం క్రితం ప్రకటన ఇచ్చిన పవన్  ఆతరువాత ఎన్నికల ప్రచారంలో ఆంధ్రులు హైదరాబాద్ లో ఇబ్బంది పడుతున్నారు అంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 

దీనితో పవన్ తన కామెంట్స్ ను తానే ఖండించుకునేలా ఎన్నికల ఫలితాలు రాకుండానే హైదరాబాద్ తిరిగి చేరుకోవడానికి వెనుక గల ఆంతర్యం ఏమిటి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.  ఇదిలావుంటే ఎన్నికల ఫలితాలు వచ్చాక అప్పటి పరిస్థితులు రాజకీయ పరిణామాలు అన్నీ పరిగణలోకి తాను నటించే సినిమాల విషయంలో పవన్ ఒక నిర్ణయం తీసుకుంటాడు అని వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం పవన్ వివిధ నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్సులు పెండింగ్ లో ఉన్న పరిస్థితులలో ఏదో ఒక నిర్మాణ సంస్థకు ఈ ఏడాది అక్టోబర్ నుండి డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. దీనితో గత సంవత్సర కాలంగా పెరిగిన గడ్డం పెరిగిన జుట్టుతో హడావిడి చేసిన పవన్ ను తిరిగి హీరోగా నీట్ లుక్ లో అభిమానులు ఎన్నికల ఫలితాలు వచ్చే లోపే పవన్ ను చూసే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: