టాలీవుడ్ లో ఎంతో మంది కమెడియన్స్ ఉన్నారు. అయితే కొంత మంది కమెడిన్స్ హీరోలుగా మారిన విషయం తెలిసిందే..కానీ హీరోగా సక్సెస్ కాలేక తిరిగి కమెడియన్లుగానే కెరీర్ కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ లోకి కమెడియన్ గా తనదైన ముద్ర వేసిన సునీల్ ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత రాజమౌళి తీసిన ‘మర్యాద రామన్న’సినిమాతో సునీల్ కి వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. ఇందుకు సునీల్ కూడా తన ఫిజిక్ ని చాలా వరకు మార్చుకున్నాడు. అయితే హీరోగా వరుసగా ఫ్లాపులు ఎదురు కావడంతో తిరిగి కమెడియన్ గానే స్థిరపడాలనుకుంటున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ కేరళాలో జరుగుతుంది. షూటింగ్ అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకొని తరువాత హైదరాబాద్ లో మరో షెడ్యూల్ మొదలుపెడతారు. దాంతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రముఖ దర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి. ప్రస్తుతం ఈ సినిమాకి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు కొరటాల శివ. ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ సునీల్ కి ఓ పాత్ర దక్కినట్లు తెలుస్తోంది. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ.. ఓ పెద్ద హీరో సినిమాలో నటించబోతున్నట్లు, అది ఆడియన్స్ కి సర్ప్రైజ్ అన్నారు.
వాస్తవానికి సునీల్ ‘ఖైదీ నెంబర్ 150’లోనే నటించాల్సి ఉన్నారు..అప్పట్లో మరో మూవీలో నటిస్తున్న కారణంగా కాల్షీట్స్ సర్దుబాటు చేయలేక సునీల్ ఆ ఆఫర్ వదులుకున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ మూవీలో సునీల్ కి ఛాన్స్ రావడం నిజంగా అదృష్టమే అనొచ్చు..ఈ సినిమా హిట్ అయితే సునీల్ బిజీ కమెడియన్ గా మారొచ్చని ఫ్యాన్స్ అంటున్నారు.