ఒకప్పుడు వెండితెరపై తన అందాలు కనువిందు చేసిన నటి పూనమ్ కౌర్ సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ పాపులర్ అయ్యిందని చెప్పాలి.  అప్పట్లో కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ జరిగిన సోషల్ మీడియా యుద్దంలో పూనమ్ పై కూడా రక రకాల పుకార్లు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే.  తాజాగా తనపై యూట్యూబ్‌లో అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సినీనటి పూనం కౌర్ సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు  ఫిర్యాదు చేసింది. 


ఆ  మధ్య పవన్ కళ్యాణ్ పై పూనం కౌర్ ఆడియో టేపుల హంగామా తెలిసిందే. అందులో ఉన్నది పూనం వాయిసా కాదా అన్నది కన్ఫర్మేషన్ లేదు కాని పూనం బయట పెట్టిన పవన్ నిజ స్వరూపం అంటూ మీడియా నానా రచ్చ చేసింది. అయితే ఇప్పుడు ఏకంగా తన గురించి అసభ్యకరమైన పోస్టులు, వీడియోలు ఎక్కువయ్యాయి.. వీటితో తనని మానసికంగా వేధిస్తున్నారని పూనం కౌర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనపై అభ్యంతరకరమైన పోస్టింగ్‌లకు సంబంధించిన 50 యూట్యూబ్ లింకులను ఆమె సైబర్‌క్రైమ్ పోలీసులకు అందజేసింది.  


ఇలా ఇష్టానుసారంగా పోస్టింగ్‌లు పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడమే కాకుండా, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొవల్సి వస్తుందన్నారు. ఈ పోస్టింగ్‌లతో రాజకీయం చేస్తున్న వారు కూడా ఉన్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకొని, ఆ పోస్టింగ్‌లను తొలిగించాలని పోలీసులను కోరారు. తనలాంటి పరిస్థితి మరే అమ్మాయికి రాకూడదని పోలీసులను ఆశ్రయించానని తెలిపింది పూనం. పోలీసులు నిందితుల్ని పట్టుకుని శిక్షించాలని పూనం కౌర్ కోరారు.

చానెళ్లలో తనపై అసభ్య ప్రచారం జరుగుతోందని ప్రముఖ నటి పూనమ్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసభ్యకర రాతలు రాస్తూ, అశ్లీల వీడియోలు పోస్టు చేస్తూ తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్నారంటూ హైదరాబాద్‌లోని సైబర్ క్రైం పోలీసులకు పూనం ఫిర్యాదు చేశారు. మొత్తం 50 చానళ్లు తనపై అసభ్యకర ప్రచారం చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనపై జరుగుతున్న ప్రచారానికి స్పందిస్తే మరింత రెచ్చిపోతారన్న ఉద్దేశంతోనే తాను ఇన్నాళ్లు ఫిర్యాదు చేయలేదన్నారు. అయితే, దీనిని అలుసుగా తీసుకున్న యూట్యూబ్ చానెళ్ల నిర్వాహకులు ప్రతిరోజూ పోస్టులు పెట్టి తనను మానసికంగా మరిన్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారని పూనం కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. నటి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తనపై యూట్యూబ్‌లో అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సినీనటి పూనం కౌర్ సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: