నందమూరి కుటుంబంలో మూడవ తరానికి చెందిన జూనియర్ ఎంటీయార్ ఇప్పటికి పాతికకు పైగా మూవీస్ చేశారు. అందులో సూపర్ హిట్లు, హిట్లుతో పాటు ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయితే జూనియర్ నటన విషయంలో మాత్రం ఎవరూ వేలెత్తి చూపించలేని విధంగా ఉంటుంది. సినిమా ఫ్లాప్ అవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అలా జూనియర్ విషయంలో ఆయన వైపు నుంచి ఎపుడూ పొరపాట్లు రాకుండా జాగ్రత్త పడతారు.


ఇదిలా ఉండగా ప్రస్తుతం జూనియర్ జక్కన్న చెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఓ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీ స్టారర్ మూవీలో మరో హీరోగా రామ్ చరణ్ ఉన్నాడు. ఈ మూవీ కోసం జూనియర్ ప్రాణం పెట్టి చేస్తున్నాడు అంటూ జక్కన్న ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే దానికి తగినట్లుగా జూనియర్ సైతం తన అంకితభావాన్ని, నిబద్ధతను చాటుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ మూవీ చేస్తున్న టైంలో మరే ఇతర కమిట్మెంట్లు పెట్టుకోకూడదని జూనియర్ డిసైడ్ అయ్యాడట. అందుకే కొత్త సినిమాలు ఏవీ కమిట్ కాలేదని తెలిసింది.


2020లో రిలీజ్ అంటున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం బల్క్ గా జూనియర్ డేట్లు ఇవ్వడమే కాదు. ఎటువంటి టెన్షన్లు పెట్టుకోకుండా మూవీ బాగా వచ్చేందుకు ఎన్ని రోజులైనా ఫరవాలేదు తీయమని జక్కన్నకు చెప్పినట్లుగా టాక్ ప్రచారంలో ఉంది. అంటే జూనియర్ మరో ఏడాదికి పైగా లాక్ అయిపోయిన‌ట్లే లెక్క. ఇక ఈ మూవీ తప్పకుండా  హిట్ అవుతుందని జూనియర్ నమ్మకంతో ఉన్నారట. దాంతో తన మార్కెట్ కూడా  బాగా పెరుగుతుందని భావించే ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: