మెగాస్టార్ చిరంజీవి ఓ తరానికి స్పూర్తి. అతి చిన్న నటుడుగా సినీ జీవితాన్ని ప్రారంభించి వెండి తెరను ఏలే రారాజుగా అవతరించిన తీరు అద్వితీయం. చిరంజీవి వేసిన బాటలో ఎందరో వచ్చి సక్సెస్ అయ్యారు. ఆ విధంగా అయన మార్గదర్శకుడుగా నిలిచారు. ఆయనది కష్టార్జితం.


అదే చిరంజీవి రాజకీయాల్లో మాత్రం అనూహ్యంగా ఫెయిల్ అయ్యారు. దానికి అనేక కారణలు ఉన్నాయి. రాంగ్ టైంలో ఆయన రాజకీయ ప్రవేశం జరిగిందని కూడా అంటారు. మరికొందరైతే పార్టీని 2014 వరకూ బతికి ఉంచితే ఆయనే ఏపీకి సీఎం అయ్యేవారని అంటారు. మొత్తానికి మెగాస్టార్ పొలిటికల్ ఎంట్రీ మాత్రం కొంత తడబాటు, పొరపాటుగానే సాగింది చివరికి ఆయన తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవితో సంత్రుప్తి చెందారు.



2018 అంటే ఇప్పటికి సరిగ్గా ఏడాది క్రితం చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం కూడా పూర్తి అయింది. ఇక కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా కొత్తగా ఆయన తీసుకోలేదు. ఆయన తన పని తనది అన్నట్లుగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. రాజకీయ ప్రస్తావనను ఆయన అసలు సహించే స్థితిలో లేరని అంటారు. ఆయన సొదరులు ఇద్దరూ ఈసారి ఏపీ ఎన్నికల్లో తన లక్కుని పరీక్షించుకున్నారు. 
చిరంజీవి వారి తరఫున ప్రచారం చేస్తారని అంతా వూహించారు. కానీ చిరంజీవి ఆ టైంలో విదేశాల్లో గడిపి పోలింగ్ రోజున ఓటు వేసేసి తన బాధ్యత అంతేనని చెప్పేశారు.



చిరంజీవిని ప్రచారం చేయమని తెలంగాణా ఎన్నికల వేళ కాంగ్రెస్ కోరింది. ఆ తరువాత సహనటి సుమలత కూడా కోరింది. కోడలు ఉపాసన తెలంగాణాలో ఎంపీగా పోటీ చేసిన  కొండా విశ్వేశ్వరరావు తరఫున ప్రచారం చేయమంది. ఎవరు ఏం చెప్పినా చిరంజీవి మాత్రం నో అనేసారని టాక్. ఆయన పూర్తి జీవితం ఇపుడు సినిమాలకే అంకితం.  ఇపుడు ఆయన బాట అమితాబ్ బాట. ఆయన కూడా రాజకీయాల్లో కొంతకాలం కనిపించి వెనక్కు వచ్చెశారు. చిరు కూడా అంతేనట.


మరింత సమాచారం తెలుసుకోండి: