ఇండియన్ బుల్లితెర మీద నానా రచ్చ చేసిన బిగ్ బాస్ షో తెలుగు బుల్లితెర మీద కూడా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. ఈ షో ప్రసారం అయ్యే మూడు నెలల పాటు బిగ్ బాస్ షో స్టార్ట్ అవుతుందంటే చాలు ఎంత అర్జెంట్ పని ఉన్నా టీవీలకు అతుక్కుపోతున్నాడు. ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ సీజన్ 1 పెద్దగా వివాదాలు లేకుండా నడిచిపోయింది. నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ -2 సీజన్ అయితే లెక్కలేనన్ని వివాదాలతో ప్రేక్షకులకు కావాల్సినంత మసాలా పండించింది.
ఇక తొలి రెండు సీజన్లు తెలుగులో సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు బిగ్ బాస్ -3 సీజన్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. జూన్, జులైలో కొత్త సెషన్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు మేకర్స్. ఈ కొత్త సీజన్‌కు హోస్ట్‌గా ఎవరు ? ఉంటారన్నది ఇంకా తెలియకపోయినా ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీల కోసం మాత్రం వేట మొదలైంది. తొలి రెండు షోల కంటే మరింత బెటర్‌గా కంటెస్టెంట్లు ఉండేలా షో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
మొత్తం 20 మందితో కంటెస్టెంట్స్ జాబితా అయితే రెడీ అయినట్టు తెలుస్తోంది. మరి వీరిలో ఫైనల్‌గా వీరిలో ఎవరు హౌస్‌లో ఉంటారన్నది చూడాలి. ఇక ఈ 20 మంది లిస్టులో యాంకర్ల పేర్లు చాలానే ఉన్నాయని టాక్. రష్మి, ఉదయభాను, ఝాన్సీ, లాస్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మేల్ యాంకర్స్ లో ప్రదీప్, రవి ఇద్దరిలో ఒకరు ఉంటారట. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ సారి జబర్దస్త్ నుంచి ఇద్దరిని తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు భోగట్టా.
వీరితో పాటు ఒకప్పుడు హీరో, హీరోయిన్లుగా ఓ మోస్తరు వెలుగు వెలిగిన సీనియర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయ్. షోను ఫస్ట్ ఎపిసోడ్ నుంచే రక్తికట్టించేందుకు గతంలోలా కాకుండా ఈ సారి ఎక్కువ మంది సెలబ్రిటీలతో హౌస్‌ను నింపేయాలన్నదే నిర్వాహకుల ప్లాన్. ఏదేమైనా ఈ సారి మంచి హోస్టర్ను కూడా పెడితే బిగ్ బాస్-3 సీజన్లో కంటెస్టెంట్ల రచ్చ మామూలుగా ఉండదేమో..!