సమ్మర్ ని సైతం సమ్మగా పక్కన పెట్టేయగల సత్తా ఆ అమ్మడికి ఉంది. గ్లామర్ కి కొత్త అర్ధం చెబుతూ ఓ రేంజిలో చెలరేగిపోతోంది. ఇంతవరకూ ఒక ఎత్తు, ఇపుడు చూసుకోండి నా తడాఖా అంటూ రెచ్చిపోతోంది. నాలుగేళ్ళ క్రితం టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ చాలా తొందరగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇపుడు ఆమె చూపు అక్కడ పడిందంట..
గ్లామర్, నటన రెండూ పుష్కలంగావున్నా కొత్త అందాల రాకతో ఈ బ్యూటీకి చాన్స్‌లు తగ్గాయి. ఇక ఇక్కడ లాభం లేదనుకుని బాలీవుడ్లో గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది రకుల్. ఇదివరకే బాలీవుడ్లో రెండు సినిమాలు చేసినా రకుల్‌కు అక్కడా కెరీర్ ఊపందుకోలేదు. దీంతో రెట్టించిన కసితో ప్రయత్నాలు చేస్తోందట రకుల్. తాజాగా అజయ్ దేవగణ్‌తో కలిసి చేస్తున్న దే దే ప్యార్ దే సినిమా కోసం గ్లామర్ సూత్రాన్నీ అప్లై చేసిందట. టీజర్లో రకుల్ అందాలు చూసిన కుర్రాళ్లంతా.. ఇంత హీట్ పెంచిందా అంటూ షాకవుతున్నారు.
ఓ పాటలో అయితే రకుల్ అందాలు షాకిస్తున్నాయి. ఈ దెబ్బతో అమ్మడు బాలీవుడ్లో సెటిలవ్వడం ఖాయమంటూ బి టౌన్ మీడియా కోడై కూస్తుంది. తాజాగా బాలీవుడ్ సినిమాల్లో గ్లామర్ కోసం మరింత సన్నబడిన రకుల్ జీరో సైజ్‌లో అదరగొడుతుంది. వరుస చూస్తుంటే రకుల్ బాలీవుడ్లో తిష్టవేయడం ఖాయం అని అంతా అంటున్నారు.
ఇదిలా ఉండగా తెలుగులోనూ మళ్ళీ బిజీ అయేందుకు రకుల్ చేస్తున్న ప్రయత్నాలు మెల్లగా వర్కౌట్ అవుతున్నాయి. మన్మధుడు 2 మూవీలో నాగార్జున పక్కన జత కడుతున్న ఈ బ్యూటీ నితిన్ తో మరో మూవీకి సైన్ చేసింది. ఇక బాలయ్య, బోయపాటి మూవీలో కూడా మైన్ హీరోయిన్ గా తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. మొత్తానికి తన కులుకులతో రకుల్ దూకుడు పెంచుతోంది.