మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో రంగస్థలం వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సుకుమార్ తో సినిమా చేయడానికి అప్పట్లో చాలామంది స్టార్ హీరోలు క్యూ కట్టారు. ఈ క్రమంలో సుకుమార్ తన తర్వాత సినిమాని మహేష్ బాబు తో చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోవడంతో తాజాగా ప్రస్తుతం సుకుమార్ - అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు ఈ విషయం మనకందరికీ తెలిసినదే.

Image result for allu arjun sukumar

ఇదిలా ఉండగా తాజాగా తన తో చేయబోయే సినిమా విషయంలో అల్లు అర్జున్ సుకుమార్ కి ఫిట్టింగ్ పెట్టినట్లు దీంతో సుక్కు ఇదెక్కడి గొడవ రా బాబు అన్నట్టుగా ఫిలిం నగర్ నుండి వస్తున్న సమాచార. విషయం ఏమిటంటే గతంలో రంగస్థలం సినిమా తీసిన తర్వాత మహేష్ తో సినిమా ఉంటుందని ప్రకటించిన తరువాత..స్టోరీ సిద్ధం చేయడంలో చాలా సమయం సుకుమార్ తీసుకుంటున్న క్రమంలో వెంటనే మహేష్ బాబు డైరెక్టర్ సుకుమార్ సినిమా లేదు అని సోషల్ మీడియాలో ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

Image result for allu arjun sukumar

ఇదే క్రమంలో ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా సుకుమార్ తో సినిమా స్టోరీ సిద్ధం చేయమని వెంటనే ఐకాన్ అనే సినిమా ప్రకటించడంతో సుకుమార్ షాక్ తిన్నారట. స్టోరీలు రాయటంలో  డైరెక్టర్ సుకుమార్ ఎక్కువ సమయం తీసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉండటంతో అల్లు అర్జున్ ఐకాన్ అనే సినిమా ప్రకటించారని అంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు. ఈ క్రమంలో తాజాగా తనకు ఎదురవుతున్న పరిస్థితులను గమనిస్తున్న సుకుమార్ వేరే ఇతర సినిమా ఇండస్ట్రీలో స్టోరీ కోసం హీరోలు చాలా కాలం వెయిట్ చేస్తారని కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతా రివర్స్ అనే కామెంట్ చేసినట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: