భీమవరం బుల్లోడు సునీల్ కు ఉండే సినిమాల పిచ్చితో తాను స్టార్ అవ్వాలనే కలలతో ఉదయాన్నే లేచి సైకిల్ తొక్కుకుంటూ భీమవరంలోని సినిమా పోస్టర్స్ అన్నీ చూస్తూ కాలంగడిపాడు అంటే సినిమాల పై సునీల్ కు ఎంత ఇష్టం ఉందో అర్ధం అవుతుంది. సినిమాలలో విలన్ గా రాణించాలనే కోరికతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఆతరువాత కోట్లాదిమందిని నటించిన కమెడియన్ గా మారిపోయాడు. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో రోజుకు దాదాపు 18 గంటలు పనిచేసిన సునీల్ ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రియమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసాడు. 

సినిమాలలో అవకాశాలు వెతుక్కుంటూ తామిద్దరం ఒకే రూమ్ లో ఉన్న విషయాలను గుర్తుకు చేసుకుంటూ తాను వంట వండితే త్రివిక్రమ్ గిన్నెలు కడిగే వాడనీ చెపుతూ తామిద్దరం కలిసి బట్టలు ఉతుక్కుంటే బట్టలు త్రివిక్రమ్ ఆరవేసేవాడని అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు సునీల్. ఇదే సందర్భంలో సునీల్ మరొక ట్విస్ట్ ఇస్తూ త్రివిక్రమ్ తాను ఎదగాల్సిన స్థాయిలో ఎదగలేక పోయాడనీ త్రివిక్రమ్ మైండ్ లో 500 కోట్ల బడ్జెట్ సినిమా కథలు ఉన్న విషయం తనకు మాత్రమే తెలిసిన రహస్యం అని అంటున్నాడు.

అణుబాంబు గురించి ఆటో రిక్షావాడికి అర్ధం అయ్యేలా చెప్పగల డైలాగ్స్ వ్రాయగల సత్తా ఫిలిం ఇండస్ట్రీలో ఒక్క త్రివిక్రమ్ కే ఉంది అంటూ ప్రశంసలు కరిపించాడు సునీల్. ఇదే సందర్భంలో త్రివిక్రమ్ తో తన సాన్నిహిత్యం గురించి వివరిస్తూ తామిద్దరం అప్పట్లో ఒకే సైజ్ లో ఉండటంతో ఒకరి ప్యాంట్ ఒకరు ఒకరి షర్ట్ మరొకరు వేసుకుని బయటకు వెళ్ళిన సందర్భాలు అనేకం అంటూ అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. 

ఇండస్ట్రీకి హీరోగా అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న ఒక సందర్భంలో ఒక ప్రముఖ దర్శకుడు తనను చూసి ‘అద్దంలో ఎప్పుడైనా నీ మొఖం చూసుకున్నావా’ అని అడిగిన ప్రశ్నతో తనకు జ్ఞానోదయం అయింది అంటూ తాను హాస్యనటుడి పాత్రలకు సరిపోతాను అంటూ మొదటిసారిగా గుర్తించింది త్రివిక్రమ్ మాత్రమే అంటూ అతడు లేనిదే తాను లేను అని అంటున్నాడు. తనకన్నా ముందుగా త్రివిక్రమ్ కు సంపాదన పెరిగినా ఆ డబ్బును తన సూట్ కేసులో పెట్టి ఆ సూట్ కేసు తాళాలు తనకు ఇచ్చి ఆడబ్బు గురించి ఎప్పుడు లెక్కలు అడగని నిజమైన స్నేహితుడు త్రివిక్రమ్ అని అంటూ తనకు ఎన్ని కష్టాలు వచ్చినా మరిన్ని సుఖాలు వచ్చినా ముందుగా తాను తన విషయాలు షేర్ చేసుకునేది త్రివిక్రమ్ తో మాత్రమే అని అంటూ తం ఇద్దరి స్నేహ బంధం గురించి అనేక ఆసక్తికర విషయాలు ఇంటర్వ్యూలో తెలియచేసాడు..   



మరింత సమాచారం తెలుసుకోండి: