వెండితెరపై మొట్టమొదటిసారిగా క్రికెటర్గా నటించి అందరిని మెప్పించాడు న్యాచురల్ స్టార్ నాని. వేసవి కానుకగా ఇటీవల విడుదలైన  జెర్సీ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా తన ఇమేజ్కి తగ్గ పాత్ర కాకపోయినా గానీ నాని ప్రయత్నించి ధైర్యం చేసి ఒప్పుకున్నందుకు నాని ని అభినందించాల్సిందే .

Image result for jersey movie

తాజాగా ఇటీవల తక్కువ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సాయంత్రానికల్లా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సాయంత్రానికల్లా బీభత్సమైన కలెక్షన్ రాబడుతున్న సినిమాగా దూసుకెళ్ళిపోతుంది. అయితే తాజాగా ఈ సినిమా కలెక్షన్ల కొద్దిగా బ్రేక్ పడింది. కారణం ఏమిటంటే  జెర్సీ సినిమాతో పాటుగా కాంచన తెలుగు సినిమా విడుదల అవటం జెర్సీ సినిమా కలెక్షన్లకు ఎఫెక్ట్ చూపించింది.

Image result for kanchana 3 movie

లారెన్స్ నటించిన కాంచన త్రీ సినిమా కు బిసి సెంటర్స్ లో జనం పోటెత్తారు. టాక్ తో సంబంధం లేకుండా ఏదో ఎంటర్ టైన్మెంట్ ఉంటుందనే నమ్మకంతో హౌస్ ఫుల్స్ చేశారు. ఫస్టు రెండు పార్టీలు బీభత్సమైన హిట్లు కావడంతో లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన మూడవ భాగానికి జనం బ్రహ్మరథం పట్టడంతో లారెన్స్ నాని సినిమాకు అడ్డుపడినట్లు అయింది అని అంటున్నారు ట్రేడ్ వర్గాలకు చెందినవారు.



మరింత సమాచారం తెలుసుకోండి: