తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోయిన నాని ఆ మద్య కృష్ణార్జున యుద్దం, దేవదాసు చిత్రాలతో ఢీలా పడ్డారు.  తాజాగా  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 2019లో ఇప్పటివరకు విడుదలైన తెలుగు సినిమాల కలెక్షన్ల పరంగా జెర్సీ టాప్-5లో నిలిచింది. 


శుక్రవారం(ఏప్రిల్ 19) థియేటర్లలోకి వచ్చిన ‘జెర్సీ’ తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.8కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.  అంతే కాదు ఈ చిత్రం  నాని కెరీర్లో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో జెర్సీ ఒకటిగా నిలిచిందని చెబుతున్నారు. 


అయితే ఈ వీక్ ఎండ్ వరకు దాదాపు రూ.20కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.  యూఎస్‌లో 132 లోకేషన్లలో ప్రీమియర్ షోల ద్వారా ‘జెర్సీ’ 1.44లక్షల డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నాని సరసన కన్నడ బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించారు.  మరో ముఖ్య పాత్రలో సత్యరాజ్ నటించారు. 
  
జెర్సీ  కలెక్షన్లు :
నైజాం: రూ .4.92 కోట్లు
సీడెడ్: రూ .1 కోట్లు
వైజాగ్: Rs 1.31 కోట్లు
ఈస్ట్: రూ. 0.86కోట్లు
వెస్ట్: రూ.
కృష్ణ: రూ. 0.77 కోట్లు
గుంటూరు: రూ. .82 కోట్లు
నెల్లూరు: రూ .36 కోట్లు
ఎపి, తెలంగాణ: రూ .10.67 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: