రాశీ రస రంగేళి…నృత్యం అదిరిందిగా!!

రాశీ రస రంగేళి…నృత్యం అదిరిందిగా!!

Image result for Rashi khanna ad shoots

“ఊహలు గుసగుస లాడే” చిత్రం తో "సొగసులు మిసమిస లాడే" అన్నట్లుగా ఉన్న ఈ డిల్లీ పిల్ల రాశీ ఖన్నా తెలుగు చిత్ర సీమకు పరిచయమైన రాసులు పోసిన అందం మాత్రమే కాదు, అభినయ అభిసారిక ..సరసిజ నయన కూడా!  “అంగడిలో అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని” అన్నట్లు - టాలీవుడ్ లో ‘గ్లామర్ ప్లస్ టాలెంట్ ‘ రెండూ హై డోస్' లో ఉండి కూడా స్టార్-లీగ్ కు చేరలేకపోయిన హీరోయిన్లలో రాశి ఖన్నా ఒకరు. మొదట్లో అందరూ రాశిని ‘గ్లామర్ క్వీన్’ అనుకున్నారు

Related image

కానీ వరుణతేజ్ 'తొలిప్రేమ' లో ఆమె నటన పాతతరం కథానాయికలను గుర్తు చేసింది ఆ సూపర్ హిట్ తర్వాత తెలుగు ప్రేక్షకులు ఆమె గ్లామర్ మాత్రమే కాదు వెండితెరపై నటనను కూడా పండించగలదని గుర్తించారు. కాని వెంటనే వచ్చిన 'శ్రీనివాస కళ్యాణం' పై భారీ ఆశలు పెట్టుకున్న ఆమెను ఆ సినిమా తీవ్ర నిరాశపరించింది. కానీ ఇప్పుడు క్రేజీ మల్టి స్టారర్ 'వెంకీమామ' లో నాగ చైతన్య తో జోడీ కడుతోంది.

Image result for erotic rashi khanna

సినిమాలే కాకుండా రాశి అప్పుడప్పుడూ షోరూం ప్రారంభోత్సవాలకు హాజరై రిబ్బన్స్ కట్ చేస్తూ ఉంటుంది యాడ్స్ లో కూడా మెరుపు తీగలా మెరుస్తూ ంఅల్లెల సుగంధాలను విరజిమ్ముతుంటుంది.