‘జెర్సీ’ రేపటితో రెండవ వారంలోకి అడుగు పెట్టబోతోంది. ఈమూవీ టాక్ విషయంలో ఎటువంటి సందేహాలు లేకపోవడంతో ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా మారుతుంది అన్న అంచనాలు మొదట్లో వచ్చాయి. అయితే ఈమూవీ హిట్ మూవీగా నిలబడింది కానీ బ్లాక్ బస్టర్ గా మారలేదు అన్నకామెంట్స్ వస్తున్నాయి. దీనికి కారణం ఈసినిమాకు ప్రస్తుతం వస్తున్న కలక్షన్స్ పరిస్థితి. 

ఈసినిమాను చూసిన ప్రతిఒక్కరు కురిపిస్తున్న ప్రశంసలను బట్టి ఈమూవీ కలక్షన్స్ అత్యంత అద్భుతంగా మారిపోయి కనీసం మూడువారాల పాటు ఈమూవీకి హౌస్ ఫుల్ బోర్డులు పడిపోవాలి. వీకెండ్ వీక్ డేస్ అనే భేదం లేకుండా టికెట్ల కోసం రద్దీ కొనసాగాలి. అయితే ఇలాంటి పరిస్థితి ‘జెర్సీ’ ధియేటర్ల దగ్గర కనిపించడం లేదు. ఈసినిమాకు వచ్చిన టాక్ కు వాస్తవంగా వస్తున్న కలక్షన్స్ కు ఎక్కడా పొంతనలేదు అన్నఅభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమాకు ఇలాంటి టోటల్ పాజిటివ్ టాక్ వచ్చి 62 కోట్ల షేర్ రాబట్టుకుంది. అదేవిధంగా ‘మహానటి’ మూవీ కూడ 45 కోట్ల షేర్ ను రాబట్టుకుంది. అయితే అలాంటి పరిస్థితి ప్రస్తుతం ‘జెర్సీ’ కి కనిపించడం లేదు. దీనికికారణం ఈసినిమా రాంగ్ టైమ్ లో విడుదల అవ్వడం అని అంటున్నారు. క్రితంవారం ఈసినిమాకు ‘కాంచన 3’ పోటీగా వస్తే ఈవారం హాలీవుడ్ మూవీ ‘అవంజర్స్ ఎండింగ్’ పోటీగా రావడం. దీనితో ఈరెండు సినిమాల మధ్య ‘జెర్సీ’ నలిగిపోతోంది అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అయితే ఈమూవీ ఈనెల మొదటి వారంలో ఉగాది పండుగను టార్గెట్ చేస్తూ ఏప్రియల్ 5న విడుదలై ఉంటే ‘మజిలీ’ ఖచ్చితంగా వెనక్కి వెళ్ళి ఉండేదనీ సోలో సినిమాగా ‘జెర్సీ’ కి మూడువారాల సమయం లభించడంతో ఖచ్చితంగా ఈమూవీ 50 కోట్ల షేర్ తెచ్చుకున్న మూవీగా నిలబడిపోయేది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి విజయ్ దేవరకొండ కంటే నాని చాల సీనియర్ మాత్రమే కాకుండా నటన విషయంలో కూడ నానీకి చాలమంచి పేరు ఉన్నా విజయ్ దేవరకొండ లాగా ఒక మ్యానియాను నాని తన సినిమాల విషయంలో ఎంత కష్టపడినా వెనకపడిపడిపోతున్నాడు అంటూ వస్తున్న కామెంట్స్ నానీని ఆలోచించేలా ప్రభావితం చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: