‘బాహుబలి’ భల్లాలదేవ పాత్ర సహజత్వం కోసం రానా పెంచిన భారీ శరీరం చూసి అప్పట్లో రానా తల్లి కూడ ఖంగారు పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ‘బాహుబలి’ విడుదల తరువాత తన శరీర విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుని తన భారీ శరీరాన్ని కంట్రోల్ లో పెట్టుకున్నాడు. 

కొంత కాలం క్రితం రానాకు కిడ్నీ సంబంధిత సమస్యలు ఏర్పడ్డాయనీ వైద్యం కోసం సింగపూర్ వెళ్ళాడని కూడ గాసిప్పులు వచ్చాయి. ఆతరువాత ఆవార్తలను సురేశ్ బాబు రానాలు ఇద్దరు ఖండించడంతో ఆ వార్తలకు చెక్ పడింది. ఈమధ్య కాలంలో రానా లేటెస్ట్ గా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో కూడ రానా మరీ సన్నగా ఏమి కనిపించలేదు. 

అయితే అనూహ్యంగా రానా పూర్తిగా సన్నపడటమే కాకుండా ఆవిషయానికి సంబంధించిన ఫోటోలు మీడియాకు లీక్ అవ్వడంతో మళ్ళీ రాణాకు ఏమైంది అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. అయితే రానా ఈమధ్య ఒక పీరియాడిక్ మూవీకి కమిట్ అయ్యాడు. ‘1992 విరాట పర్వం’ పేరుతో నిర్మిమింపబడుతున్న ఈమూవీకి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తూ ఉంటే ఈమూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. 

దీనితో ఈసినిమా కోసం రానా ఇలా సన్నపడిపోయాడు అని కొందరు అభిప్రాయపడుతుంటే మరికొందరు రానా ఆరోగ్యంలో మళ్ళీ ఏమైనా మార్పులు వచ్చాయా అంటూ సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ప్రస్తుతం రానా లేటెస్ట్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: