వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఎఫ్ 2’ ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో రియల్ బ్లాక్ బస్టర్ హిట్. వీరిద్దరి కామెడీ ఆసినిమా సక్సస్ కు ఎంతగానో సహకరించింది. ఇలాంటి పరిస్థుతులలో వీరిద్దరినీ ఒక ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ తమ సినిమా కోసం కలపడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ మూవీల పై భారీ అంచనాలు ఉంటాయి. ప్రస్తుతం వీరు నిర్మిస్తున్న ‘అల్లాదిన్’ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. 1992 లో విడుదలైన యానిమేటెడ్ మూవీ ‘అల్లాదిన్’ కు ఇది రీమేక్. భారీ బడ్జెట్ తో తీసిన ఈమూవీ మే నెల 24న విడుదల కాబోతోంది.

ఈసినిమాకు సంబంధించి రెండు ముఖ్య పాత్రలకు వెంకటేష్ వరుణ్ తేజ్ లు డబ్బింగ్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. వెంకటేష్ ఈసినిమాలోని జెని విల్ స్మిత్ పాత్రకు డబ్బింగ్ చెపితే అలాడిన్ పాత్రకు వరుణ్ తేజ్ అల్లాదిన్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం సంచలనంగా మారింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు వెంకటేష్ తన సహజ సిద్ధమైన హాస్య చతురతతో ఈమూవీలోని జెని విల్ స్మిత్ పాత్రకు చెప్పిన డైలాగ్స్ తెగ నవ్వు తెప్పిస్తాయని అంటున్నారు. ఈమధ్య కాలంలో అనుకోకుండా తెలుగు హిందీ సినిమాల కంటే హాలీవుడ్ సినిమాలకు మ్యానియా ఏర్పడింది. ఈరోజు విడుదల అవుతున్న అవంజెర్స్ ఎండింగ్ మ్యానియా చూసినవారికి వచ్చేనెల విడుదల కాబోతున్న ఈ ‘అల్లాదిన్’ మూవీ కూడ ఇలాంటి సంచలనాలే రిపీట్ చేస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: