ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన బిగ్ బాస్ బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  ఈ షో భారత దేశంలో బాగా పాపులారిటీ సంపాదించింది.  దాంతో ఇతర భాషల్లో కూడా ఈ ప్రోగ్రామ్ నిర్వహించడానికి యాజమాన్యం తయారైంది.  తెలుగు, తమిళ, కన్నడ, మళియాళ భాషల్లో బిగ్ బాస్ లైవ్ షో ను తీసుకు వచ్చారు.  తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హూస్ట్ గా ఉన్నారు.  ఈ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ అయ్యింది.  ఈ సీజన్ కి శివబాలాజీ విన్నర్ గా నిలిచారు.   

బిగ్ బాస్ సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని హూస్ట్ గా వచ్చారు.  ఈ ప్రోగ్రామ్ మొదటి నుంచి కాంట్రవర్సిగానే కొనసాగుతూ వచ్చింది.  తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 కి కౌశల్ విన్నర్ గా నిలిచారు.  తమిళంలో కమల్ హాసన్, కన్నడంలో కిచ్చా సుదీప్, మళియాళంలో మోహన్ లాల్ లు బిగ్ బాస్ కి హూస్ట్ లుగా ఉన్నారు.  తెలుగులో బిగ్ బాస్ మూడో సీజన్ కు రెడీ అవుతోంది. బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్‌లుగా ఎవరు రాబోతున్నారన్నదానిపై గత కొద్దిపెద్ద చర్చే నడుస్తోంది.  బిగ్ బాస్ సీజన్ 2 ఎఫెక్ట్ బాగా పడటంతో ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.  ఒక రకంగా చెప్పాలంటే..సీజన్ 1తో పోలిస్తే.. సీజన్ 2లో కంటెస్టెంట్స్ పెద్ద ఆసక్తికరంగా లేదని విమర్శలు వచ్చాయి. దాంతో యాజమాన్యం సీజన్ 3 ద్వారా ఆ లోటును పూడ్చేందుకు ఫేమస్ సెలబ్రిటీలను బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్‌గా హౌస్‌కి తీసుకురాబోతున్నారని సమాచారం. 


మహాతల్లి ఫేమ్ జాహ్నవి, వెబ్ మీడియా ఆర్టిస్ట్ జ్యోతి, హీరోయిన్ శోభిత ధూళిపాళ, జబర్దస్త్ నరేష్ , యాంకర్ ఉదయభాను, టీవీ ఆర్టిస్ట్ జాకీ, హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ రేణు దేశాయ్, ఆర్టిస్ట్ చైతన్య కృష్ణ, ఆర్టిస్ట్ మనోజ్ నందన్, కమల్ కామరాజు, నాగ పద్మిని, డాన్స్ మాస్టర్ రఘు, సింగర్ హేమ చంద్ర, హీరోయిన్ గద్దె సింధూర, గుత్తా జ్వాల వీరితో పాటు కామన్ మాన్ కేటగిరి నుంచి ముగ్గురుని ఉండబోతున్నట్లు ఆప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇంకా ఈ విషయంలో అఫీషియల్ గా ప్రకటన వెలువడాల్సి ఉంది. జూన్ లో బిగ్ బాస్ 3 మొదలు కానుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: