ఈ మద్య సినీ పరిశ్రమలో హీరోల వారసులే కాదు వారసురాళ్లు కూడా వస్తున్నారు.  బాలీవుడ్ లో ఈ సంస్కృతి ఎప్పటి నుంచొో నడుస్తుంది.  తెలుగు లో మెగా బ్రదర్ తనయ కొణిదెల నిహారిక హీరోయిన్ గా వస్తుంది.  విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తన సత్తా చాటుతుంది.


స్వతహాగా సింగర్, మ్యూజీషియన్ అయిన శృతి హసన్ తన అందంతో అందరినీ మంత్ర ముగ్దులను చేసింది.  టాలీవుడ్ లో టాప్ హీరోలతో నటించిన శృతి హాసన్ ఆ మద్య సినిమాకు కాస్త దూరంగా ఉంటూ వచ్చింది.  లండన్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌ గత కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం తన తండ్రి కమల్ హాసన్ కి కూడా తెలుసని..వారిద్దరితో కమల్ దిగిన ఫోటోలు కూడా షేర్ చేసింది.  


అయితే శృతి హాసన్ , మైఖెల్‌ కోర్సేల్‌ ని వివాహం చేసుకుంటుందని అందరూ భావించారు..వారి వివాహానికి కమల్ కూడా ఓకే చెప్పినట్లు తెగ వార్తలు వచ్చాయి.  కానీ అందరూ ఊహించినదానికి రివర్స్ అయ్యింది. పీకల్లోతు ప్రేమలో ఉన్న శృతి హాసన్ , మైఖెల్‌  ఇప్పుడు బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన మైఖేల్, జీవితం తామిద్దరినీ వ్యతిరేక మార్గాల్లో ఉంచిందని అనడం గమనార్హం.


తామిద్దరమూ ఇక ఒంటరి మార్గాల్లో నడవాల్సి రావడం దురదృష్టకరమని, శృతి ఎప్పటికీ తన బెస్ట్ ఫ్రెండేనని అన్నాడు.  శృతితో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్న మైఖేల్, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పాడు.కాగా, 2016లో లండన్ కు వెళ్లిన శృతికి మైఖేల్ పరిచయం కాగా, వీరిద్దరి మధ్యా మొదలైన స్నేహం ప్రేమగా మారింది.


మైఖేల్ కోసం నెలకోసారైనా శృతి లండన్ వెళ్లి వస్తుండేది. శృతి ఇంట్లో జరిగిన పలు శుభకార్యాలకు సైతం మైఖేల్ రావడంతో వీరిద్దరి వివాహం ఖాయమన్న వార్తలు వచ్చాయి.  శ్రుతి ఇంట్లో జరిగిన పలు శుభకార్యాలకు సైతం మైఖేల్ రావడంతో వీరిద్దరి వివాహం ఖాయమన్న వార్తలు వచ్చాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: