ప్రిన్స్ మ‌హేష్‌బాబు లేటెస్ట్ సినిమా మ‌హ‌ర్షిలో అల్ల‌రి న‌రేష్ కూడా ఓ పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కామెడీ హీరోగా ఒక‌ప్పుడు వ‌రుస హిట్లు కొట్టిన అల్ల‌రోడు ఆ త‌ర్వాత రేసులో వెన‌క‌ప‌డిపోయాడు. ఇక ఇప్పుడు మ‌హేష్‌బాబు సినిమాలో చేస్తోన్న రోల్ ద్వారా మ‌ళ్లీ ఒక్కసారిగా హైలెట్ అయ్యాడు. సూప‌ర్‌స్టార్ సినిమాలో న‌రేష్ రోల్ అంటే కామెడీ ఉంటుందా ?  ఈ రోల్‌ను ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ఎలా డిజైన్ చేశాడు ? అన్నది స‌హ‌జంగానే అంద‌రికి ఆస‌క్తిగా ఉంటుంది. 


మ‌హ‌ర్షిలో అల్ల‌రోడు ర‌వి అనే క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్నాడు. కాలేజ్‌లో మ‌హేష్‌, పూజాల‌తో స్నేహం చేస్తూ ఫ‌స్టాఫ్‌లో కామెడీకి స్కోప్ ఉండే పాత్రే అని తెలుస్తోంది. ఆ త‌ర్వాత మ‌హేష్ - ర‌వి మ‌ధ్య ఉండే స్నేహం ఎంత విలువైందో ?  చెప్పేలా సెకండాఫ్‌లో వీరిద్ద‌రి రోల్ ఉంటుంద‌ని ట్రైల‌ర్ చెప్ప‌క‌నే చెపుతోంది. ఇక త‌న క్యారెక్ట‌ర్ గురించి ప్రి రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన న‌రేష్ సింపుల్  స్పీచ్ తో ఆకట్టుకున్నాడు. 


త‌న పాత్ర గురించి పూర్తిగా చెప్ప‌క‌పోయినా లైట్‌గా హింట్ ఇస్తూ ద‌ర్శ‌కుడు వంశీ న‌న్ను కామెడీ యాంగిల్ లోనే కాకుండా కొంచెం సీరియస్ యాంగిల్ లో కూడా చూపించారు. ఇంత మంచి క్యారెక్టర్ కోసం నన్ను  తీసుకున్నందుకు ద‌ర్శ‌కుడు వంశీకి కృత‌జ్ఞ‌త‌లు అని చెప్పాడు. నరేష్ చెప్పిన దానిని బట్టి అతడి పాత్రలో కామెడీ కంటే సీరియస్ నెస్.. ఎమోషన్ దాగి ఉంటుందని .. ఫ్రెండ్షిప్ కి సంబంధించిన కీలక మైన ట్విస్ట్ కోసం ఆ పాత్రను రూపొందించారని అర్థమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: