నిన్నరాత్రి మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాటల మధ్య సుకుమార్ ప్రస్తావన తీసుకు వచ్చాడు. ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను  మాట్లాడుతూ ఈరోజులలో ఒక దర్శకుడు తన స్క్రిప్ట్ విషయమై రెండునెలలు కూడా వేచి ఉండటం లేదు అని తాను చేసిన కామెంట్స్ సుకుమార్ కు సంబంధించినవి కావనీ క్లారిటీ ఇచ్చాడు. 

కేవలం వంశీ పైడిపల్లి సహనం గురించి పొగుడ్తూ అతడు తన గురించి రెండు సంవత్సరాలు ఆగిన సందర్భాన్ని వివరిస్తూ ఆ కామెంట్స్ చేసాను కానీ సుకుమార్ ను టార్గెట్ చేస్తూ తాను చేసిన కామెంట్స్ కావనీ మహేష్ వివరంగా వివరణ ఇచ్చాడు. అంతేకాదు సుకుమార్ తనకు చాల సన్నిహితుడనీ వివరిస్తూ సుకుమార్ పై ప్రశంసలు కురిపించాడు.

వాస్తవానికి సుకుమార్ తన కోసం వ్రాసిన కథ ఒక సందేశంతో ముడిపడి ఉన్న నేపధ్యంలో ఇలా వరస పెట్టి సందేశాత్మక సినిమాలు చేసుకుంటూపోతే తన పై ఆముద్ర పడిపోతుంది అన్న భయంతో తాను సుకుమార్ మూవీని వదులుకున్నాను అన్న క్లారిటీ ఇచ్చాడు. అందువల్లనే తాను తన జోనర్ మార్చుకుని అనీల్ రావిపూడి సినిమాలో పూర్తిగా నవ్వు తెప్పించే ‘దూకుడు’ లాంటి కథను ఎంచుకున్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. 

దీనితో మహేష్ సుకుమార్ ల మధ్య పెరిగిన గ్యాప్ కు అదేవిధంగా మహేష్ సుకుమార్ అవమాన పరిచాడు అని వస్తున్న వార్తలకు మహేష్ చెక్ పెట్టడానికి ‘మహర్షి’ ఇంటర్వ్యూను చాల తెలివిగా వాడుకున్నాడు. అయితే మహేష్ ఇచ్చిన క్లారిటీతో సుకుమార్ తనకు జరిగిన పరాభవాన్ని మరిచిపోయి నిజంగానే మళ్ళీ మహేష్ కు స్నేహితుడుగా కొనసాగుతాడా లేదా అన్నది రానున్న రోజులలో తెలుస్తుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: