వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మహేష్ బాబు తన కెరీర్ లో 25వ సినిమా 'మహర్షి' సినిమా చేశారు. మరి కొద్ది రోజులలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రస్తుతం చాలా జోరుగా సాగుతున్నాయి. సినిమా యూనిట్ మొత్తం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో అక్కినేని సమంత 'మహర్షి' సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Related image

సమంత రిలీజ్ చేసిన వీడియో లో మహేష్ బాబు ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తూ ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయమని తేల్చేసింది. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే మరియు సినిమా యూనిట్ కి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పింది.

Image result for samantha maharshi

ఈ సందర్భంగా తన భర్త మహేష్ బాబు పై సమంతా చూపించిన అభిమానానికి కృతజ్ఞతగా మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియా ద్వారా సమంతకు ధన్యవాదాలు చెప్పారు.ఈ మేరకు సమంత వీడియోను షేర్ చేస్తూ.. ''సామ్ నువ్వంటే మా ఫ్యామిలీకి ఎంతో ఇష్టం. సితార మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. 'మహర్షి'కి శుభాకాంక్షలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు'' అంటూ రాసుకొచ్చింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: