మళయాళ ప్రేమం సినిమాతో సౌత్ లో చాలా ఫేమస్ అయిన సాయి పల్లవి తెలుగులో నటించిన మొదటి సినిమా ఫిదా. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. వరుణ్ తేజ్ కు మొదటి కమర్షియల్ హిట్ ఇచ్చిన ఈ సినిమాలో సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా వచ్చిండే పిల్లా సాంగ్ అయితే దుమ్ముదులిపేసింది. 


శక్తికాంత్ మ్యూజిక్ అందించిన ఫిదాలోని ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేసిందంటే నమ్మాల్సిందే. ఇప్పుడు ఈ సాంగ్ మరో మైల్ స్టోన్ అందుకుంది. యూట్యూబ్ లో 200 మిలియన్ వ్యూస్ అంటే 20 కోట్ల వ్యూస్ సాధించింది. సాయి పల్లవి సినిమాలో హీరోయిన్ గా ఉంది అంటే ఆమె సాంగ్స్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ అన్నట్టే. ఫిదాలో వచ్చిండే పాటలానే మారి 2లో రౌడీ బేబి సాంగ్ కూడా అదరగొట్టింది.


ఫిదా పాట కన్నా ముందే రౌడీ బేబి సాంగ్ యూట్యూబ్ లో 200 మిలియన్ వ్యూస్ సాధించింది. సినిమా హిట్టు ఫ్లాపు అన్నది పక్కన పెడితే ఈరకంగా కూడా సాయి పల్లవి బాగా ఫేమస్ అవుతుంది. స్వతహాగా డ్యాన్సర్ కాబట్టి అమ్మడు ఈ సాంగ్స్ లో తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఫిదా పాట ఓ రేర్ ఫీట్ సాధించింది. 


తెలుగులో ఈ రేంజ్ లో వ్యూస్ సాధించిన పాట ఇదే అని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది సాయి పల్లవి. సూర్య ఎన్.జి.కే సినిమాలో నటించిన ఆమె రెండు తెలుగులో సినిమాలకు ఓకే చెప్పిందని తెలుస్తుంది. ఏది ఏమైనా సాయి పల్లవి సినిమాలో ఉంది అంటే ఆ సినిమాకు స్పెషల్ క్రేజ్ వచ్చినట్టే లెక్క. 



మరింత సమాచారం తెలుసుకోండి: