సాధారణంగా సినిమా టైటిల్స్ విషయాల్లో ఎన్నో కాంట్రవర్సీలు ఉంటాయి. ఓ సినిమా రూపొందుతున్న సమయంలో ఫస్ట్ లుక్ చూసి ఈ టైటిల్ తమదే అని అచ్చం అలాంటి టైటిల్, డిజైన్ మేం రిజిస్టర్ చేయించుకున్నామని వివాదాలు తలెత్తుతుంటాయి. ఇటీవల్ నిఖిల్ నటించిన ‘అర్జున్ సురువరం’సినిమా వాస్తవానికి ముద్ర టైటిల్ తో మొదటైంది.  ఈ టైటిల్ లో ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. 

అయితే ఇదే టైటిల్ తో జగపతి బాబు, రావు రమేష్ నటించిన ఓ సినిమా రిలీజ్ అయ్యింది..దాంతో కొన్ని రోజులు ఈ వివాదం నడిచినా..మొత్తానికి నిఖిల్ వెనక్కి తగ్గారు.  ప్రస్తుతం ముద్ర టైటిల్ స్థానంలో అర్జున్ సురవరం తీసుకున్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు మరోసినిమా టైటిల్ వివాదం తెరపైకి వచ్చింది.  
అజయ్ భూపతి దర్శకత్వంలో ‘ఆర్ఎక్స్ 100’సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ  ప్రస్తుతం 'హిప్పీ' అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో పాటు ఆయన 'గుణ 369' అనే టైటిల్ తో మరో ప్రాజెక్టును ను పట్టాలెక్కించాడు.  ఈ మద్య ‘గుణ 369’ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ టైటిల్ విషయంలోనే వివాదం తలెత్తింది. కళాధర్ కొక్కొండ అనే దర్శక నిర్మాత ఆల్రెడీ 'గుణ' టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో వుంది.

తమ సినిమా టైటిల్ ను అర్జున్ జంధ్యాల టీమ్  కాపీ చేశారని..టైటిల్ పక్కన 369 నెంబర్  తగిలించారని ఆయన  తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: