విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా  సినిమా “డియర్ కామ్రేడ్”. ఈ సినిమా ద్వారా షార్ట్ ఫిలిం మేకర్ అయిన భరత్ కమ్మ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు విజయ్ .ఇటీవలే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం టాకీ పార్ట్ తో బిజీగా ఉంది. 

ఇక ఈ చిత్రాన్ని జులై 26న ప్రపంచవ్యాప్తందిగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంతటా విపరీతమైన అంచనాలు ఉన్నాయి, దీనికి తోడు ఈ చిత్ర టీజర్ కి విశేషమైన స్పందన లభించడం చూస్తుంటే ఈ సినిమాకి "అర్జున్ రెడ్డి" కంటే ఎక్కువ క్రేజ్ లభించదనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 

ఇక ఈ చిత్రంలో  విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా నటిస్తుండగా హీరోయిన్ రష్మిక క్రికెట్ ప్లేయర్ గా కనిపించనుంది.  గత ఏడాది "గీతగోవిందం"తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ జంట ఇప్పుడు మరోసారి జత కట్టడంతో అదే రేంజ్ హిట్ మరోసారి అందుకుంటారా లేదా అనేది తెలియాల్సివుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: