టాలీవుడ్ పెర్‌ఫెక్ట్ కపుల్ నాగచైతన్య, సమంత ఇప్పుడు స్పెయిన్ టూర్ లో ఉన్నారు.  గత ఏడాది వీరిద్దరూ గోవాలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.  అప్పడు మూడు నెలలు హనీమూన్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఇద్దరూ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు.  మనం తర్వాత వీరిద్దరు జంటగా కలిసిన నటించిన సినిమా ‘మజిలీ’.  మొదటి నుంచి ఈ సినిమా ఎన్నో అంచనాలు పెంచుతూ...రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో సక్సెస్ టాక్ తెచ్చుకుంది.

తాజాగా  వీరిద్దరు కలిసి నటించిన 'మజిలీ' మూవీ సూపర్ హిట్ కావడంతో ఉత్సాహంతో టూర్ కు వెళ్లారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఇప్పుడు చైతన్య, తాను దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తోంది. 


తాజాగా చైతన్య ఫోటోను పోస్ట్ చేసి సామ్ 'ఐ లవ్ యూ 3000'  అంటూ ఒక క్యాప్షన్ ను కూడా జోడించింది. లేటెస్ట్ హిట్ మూవీ 'జెర్సీ'లోని ఈ డైలాగ్ ను సమంత ఇలా పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా  మారింది. చై పై తన ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయడంతో పాటు లేటెస్ట్ మూవీస్ ను కూడా సమంత బాగానే ఫాలో అవుతోందని నెటిజన్లు ముచ్చటించుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: