ఈ సమ్మర్ చాలా చప్పగా ఉంది. పెద్ద సినిమాలు అసలే లేవు, పైగా వంద కోట్ల సినిమా అంతకంటే లేదు. జెర్సీ మూవీ వంద కోట్ల ఆశ అలాగే ఉండగానే కలెక్షన్లు డ్రాప్ అయిపోయాయి. ఇక  సమ్మర్లో పెద్ద సినిమాలు ఒక్కటి కూడా లేకపోవడం ఈసారి పెద్ద లోటు. ఈ నేపధ్యంలో మొత్తానికి మొత్తం బకాయి తీర్చుకోవడానికా అన్నట్లుగా మహర్షి వస్తున్నాడు.


ఈ మూవీకి పాజిటివ్ బజ్ రావడం శుభపరిణామం. మహేష్ మూవీ అంటేనే క్లాస్ మాస్ తేడా లేకుండా చూస్తారు. ఇక సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే కలెక్షన్ల సునామీయే అవుతుంది. దాంతో మహేష్ మూవీ మీద కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మొత్తం ఇండస్ట్రీయే ఎక్కువగా ఆశపడి  చూస్తోంది. టాలీవుడ్లో ఇపుడు మహర్షి  పెద్ద హాట్ టాపిక్ గా  ఉంది. 


ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో అని మహేషే చెప్పినట్లుగా మహర్షి కొడితే రికార్డుల గూబ గుయ్యిమంటుందని అంటున్నారు. ఈ సమ్మర్ దాహం మొత్తం ఒక్క సినిమా చాలు తీర్చేడానికి అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇటు ఆడియన్స్, అటు టాలీవుడ్ అంతా తెగ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. మరి మహర్షి  వూపూ గ్రాఫ్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: