అభిమానం ఉంటే దాన్ని ఉంచుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే తప్ప దాన్ని అడ్డకు పడ్డా క్యాష్ చేసుకోవాలని చూసుకోకూడదు, కానీ ఇపుడు జరుగుతోందేంటి. కొత్త సినిమా వస్తే చాలు ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచేసి సామాన్యుడు ఇల్లు గుల్ల చేస్తున్నారు. వందల  కోట్ల దాహం తీరాలంటే ఆడియన్ ని అడ్డంగా దోచేయడమేనట. 


గత కొంతకాలంగా విడుదలవుతున్న సినిమాలకు వంద రెండు వందల  కోట్ల క్లబ్బుల పిచ్చి బాగా పట్టుకుంది. ఉన్న టికెట్ రేటుకు రెండింతలు పెంచేసి మరీ కొత్త  టాక్స్ వేసేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ గాళ్ళను తోసేసి మరి పక్కా బిజినెస్ చేసుకుంటున్నారు. పెద్ద హీరోల సినిమాలు కుటుంబంతో సహా చూడాలంటే జేబులు చిల్లు పడాల్సిందే. ఇదేంటి అంటే అంతే అంటున్నారు మన హీరోలు. నిర్మాతలు. ఒకపుడు పెద్ద హీరోల సినిమా విడుదలై కలెక్షన్లు దుమ్ము దులిపినా రేట్ మాత్రం అలాగే ఉంచేసేవారు. ఎక్కడైన బ్లాక్ టికెట్లు అమ్మితే అది వేరే విషయం.


ఇపుడు ఏకంగా బ్లాక్ ని వైట్ చేసి మరీ టికెట్లు రేట్లు పెంచుకుంటున్నారు. ఇది దారుణమే. సినిమా బాగుంటే చూస్తారు, అంతే కానీ దాని కోసం ముందే పదిహేను రోజుల పాటు రేట్లు పెంచేసి గుంజాలనుకోవడం  బాధాకరం. నీతులు వెండి తెర మీద చెప్పే హీరోలు ఇలాంటి వాటి విషయంలో ఎందుకు నోరు విప్పరో అర్ధం కాదు. రికార్డుల వేటలో పడి ఆడియన్ని నిలువు దోపిడీ చేస్తున్నామన్న ఆలోచన లేకుండా పోతోంది. ఇకనైనా వీటికి ఫుల్ స్టాప్ పెడితే అందరూ సినిమా చూస్తారు. మరి ఈ జీఎస్టీ ని అడ్డుకునే అసలైన హీరో ఎవరు...??


మరింత సమాచారం తెలుసుకోండి: