రకుల్ ప్రీతీ సింగ్ కు ఆ మధ్య అవకాశాలు తగ్గిన ఈ మధ్య బాగానే అవకాశాలను కొల్లగొడుతుంది. అలాగే హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను రెచ్చగొడుతుంటుంది. తాజాగా మరోసారి విరుచుకుపడింది రకుల్. ఈ సారి బ్లూ కలర్ థీమ్ లో డ్రెస్ వేసుకుంది. స్లీవ్ లెస్ బ్లూ కలర్ టాప్..  వైట్ కలర్  స్ట్రైప్స్ ఉండే  బ్లూ కలర్ బెల్ బాటం ప్యాంట్ తో స్టైలిష్ గా నిలబడింది. అదే కలర్ లో ప్రింటెడ్ డిజైన్ ఉన్న షర్టును ఊరికే అలా తన భుజంపై వేసుకుంది.


మరో ఫోటోలో అదే షర్టు వేసుకొని క్లోజప్ ఫోటోకు పోజిచ్చింది.  బ్రౌన్ షేడ్ లో స్ట్రెయిట్ చేసిన హెయిర్ తో ఒక సూపర్ మోడల్ లాగే కనిపిస్తోంది.  రకుల్ డ్రెస్ ను డిజైన్ చేసిన వారు మహిమా మహాజన్. ఈ డ్రెస్ కూడా రకుల్ తాజా చిత్రం 'దే దే ప్యార్ దే' ప్రమోషన్స్ సందర్భంగా ధరించానని తన ఇన్స్టా ఖాతా ద్వారా తెలిపింది. 


ఫస్ట్ ఫోటోలో రకుల్ స్టైల్ ను చూసినవారెవరైనా ఫిదా కాకుండా ఉండగలరా? ఇక ఆ క్లోజప్ షాట్ లో రకుల్ సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ కూడా అదిరిపోయింది. ఈ ఫోటోలను పోస్ట్ చేసి జస్ట్ అరగంట కూడా కాలేదు  కానీ అరవై వేల లైక్స్ వచ్చాయి. రకుల్ ను "మోడరన్ బ్యూటీ" అని ఒకరు అంటే.. మరొకరు క్లోజప్ షాట్ నచ్చిందని చెప్పారు. ఏదైతేనేం ఒకటి మాత్రం నిజం.  రాకుల్ ఈ ఫోటో షూట్ల దాడి ఇప్పట్లో ఆపేలా లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: