మహేష్ సినిమాలలో ఘోరమైన ఫ్లాప్ ల లిస్టులో ‘స్పైడర్’ మొదటి వరసలో ఉంటుంది. మహేష్ ను కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసి మహేష్ మ్యానియాను తమిళ ప్రేక్షకులలో కూడ బాగా కొనసాగించాలి అన్న ఉద్దేశ్యంతో మహేష్ తో మురగదాస్ ‘స్పైడర్’ మూవీని తీసాడు. 

ఈమూవీ పై మహేష్ కూడ ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అయితే ‘స్పైడర్’ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో మహేష్ ఆ షాక్ నుండి కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది అని అంటారు. అలాంటి భయంకరమైన ఫ్లాప్ మురగదాస్ ఇచ్చినా ఏ ఇంటర్వ్యూలో కూడ మహేష్ మురగదాస్ గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు. 

అయితే ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ మురగదాస్ ప్రస్తావన తీసుకురాలేదు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఒక టాప్ డైరెక్టర్ కి ఎదురైతే అలాంటి విషయాలను చాల సీరియస్ గా తీసుకుంటారు. ఈవిషయాలు ఏమీ పట్టించుకోకుండా మురగదాస్ ఈరోజు విడుదలైన ‘మహర్షి’ విజయం కోరుతూ ట్విట్ చేసాడు.

అంతేకాదు మహేష్ చాల కష్టపడే నటుడనీ స్వచ్చమైన మనసున్న వ్యక్తి అని చెపుతూ అలాంటి వ్యక్తికి సూపర్ హిట్ దక్కాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మహేష్ ను ‘సర్’ అంటూ సంభోదించాడు. దీనితో మురగదాస్ పెట్టిన ట్విట్ కు మహేష్ అభిమానులు విపరీతంగా కనెక్ట్ అవ్వడమే కాకుండా ఇప్పటిదాకా ‘స్పైడర్’ లాంటి సినిమాను తీసినందుకు మురగదాస్ ను తిట్టిపోసిన మహేష్ అభిమానులు ప్రస్తుతం మురగదాస్ పై ప్రసంసలు కురిపిస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: