మహేష్ బాబు సరికొత్త సినిమా మహర్షి మంచి టాక్ ను సొంతం చేసుకొని ఈ సమ్మర్ లో బ్లాక్ బస్టర్ దిశగా తన అడుగులు వేస్తోంది. అయితే సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమాలో పోషించిన పాత్రలే చాలా విశేషాన్ని సంతరించుకున్నాయి. ముఖ్యంగా 40 ఏళ్ల పైబడ్డ మహేష్ కాలేజ్ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయిన తీరు అయితే అమోఘం. మనకు మళ్లీ కుర్ర మహేష్ ను సరైన టైమింగ్ తో తెర మీద చూపించారు వంశీ.

ఇక అందరి నోట ఒకటే మాట ఏమిటంటే, ప్రిన్స్ మహేష్ రైతు పాత్రలో అదరగొట్టేశాడు అని. బాబు తన ఇన్నేళ్ల యాక్టింగ్ కెరీర్ లో ఒక్క సారి కూడా రైతు పాత్ర పోషించింది లేదు. ట్రైలర్ ను బట్టి ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ సామాన్య రైతు కావడానికి గల కారణం, ఆ ప్రయాణమే ఈ సినిమాకు ఊపిరిగా చెప్పుకోవచ్చు.

ఇక సినిమా చివరి క్లైమాక్స్ భాగంలో వచ్చే “ పదర పదరా” పాట అయితే ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది అంటే నమ్మరు. ఇక 20 నిమిషాలు బాబు ను ఒక్కసారిగా రైతు పాత్రలో చూడ్డం సూపర్ స్టార్ అభిమానులకు ఒక గొప్ప అనుభూతి అనే చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో మహేష్ నుండి ఎన్ని మంచి మంచి పాత్రలు చూడవొచ్చో అని మహేష్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: