ఒకప్పుడు టాలీవుడ్ లో దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే.. ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అనేవారు.  ‘దేవి’సినిమాతో తన కెరీర్ మొదలు పెట్టిన దేవీ శ్రీ ప్రసాద్ అతి తక్కువ కాలంలోనే క్లాస్, మాస్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.  అప్పట్లో మెగా హీరోలు దేవినే ఎక్కువగా తమ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకునేవారని టాక్ వినిపించింది.  అది ఒకప్పటి మాట..ఈ మద్య దేవి శ్రీ ప్రసాద్ స్థానంలో ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు ఎంట్రీ ఇస్తున్నారు.  తెలుగు లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా తెలుగు సినీ పరిశ్రమపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. 

అంతే కాదు ఈ మద్య దేవిలో కాస్త పవర్ తగ్గిందని..హిట్ పాటలు ఇవ్వలేక పోతున్నారని వార్తలు కూడా వచ్చాయి.  ఎంతటివారైనా ఒక దశ వరకు మాత్రమే వారి శక్తి సామర్ధ్యాలను చూపించగలరు. సినిమా ప్రపంచంలో జనరేషన్స్ మారుతున్న కొద్దీ టెక్నీషియన్స్ కూడా మారిపోతుంటారు.  ఈ నేపథ్యంలో దేవి కి సినీ చాన్సులు కూడా తగ్గాయి.  ఇలాంటి పరిస్థితిలో వంశి పైడిపల్లి, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘మహర్షి’మూవీకి సంగీత దర్శకుడిగా దేవీ శ్రీని తీసుకున్నారు.  ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన కొన్నిలిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయగా..అభిమానులను పెద్దగా ఆకర్షించలేదని వార్తలు వచ్చాయి. 

అయితే ఈసారి మాత్రం దేవీ  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడని టాక్ వినిపిస్తుంది.  సినిమాలో మహేష్ ఎమోషన్స్ సీన్స్ లో మెయిన్ గా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. నేపథ్యం సంగీతంతో దేవి బాగానే మెప్పించాడని ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.  క్లయిమాక్స్ లో దేవీ నిజంగా కన్నీళ్లు తెప్పించేలా బీజీఎమ్ ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది.   మొత్తానికి పాటలు అంతగా క్లిక్కవకపోయినా బీజీఎమ్ తో రాక్ స్టార్ సత్తా చాటాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: