అర్జున్‌రెడ్డి సినిమా పేరు చెబితే ఈ సినిమా సృష్ఠించిన సంచనాలన్నీ ఒక్కసారిగా మనందరికి గుర్తొస్తాయి. ఇలాంటి కంటెంట్ తో కూడా సినిమా తీయెచ్చా..తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టొచ్చా...లెక్క లేనన్ని సంచలనాలను క్రియోట్ చేయెచ్చా..? అని ఇండస్ట్రీలో కొత్త దర్శకుల దగ్గర్నుంచి సీనియర్ దర్శకుల వరకు ప్రతీ ఒక్కరు ఈ సినిమా గురించే మాట్లాడుకున్నారు. అంతగా ఈ సినిమా ఇన్స్పైర్ చేసింది. ఇక విజయ్ కి అయితే మాస్ హీరోగా తిరుగు లేని స్టార్ డం ని తెచ్చిపెట్టింది. 


అలాంటి విజయ్ గీత గోవిందం తో డీసెంట్ హిట్ ని కొట్టి 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇప్పుడు రాబోతున్న డియర్ కామ్రేడ్ కూడా ఇలాంటి సినిమానే అంటున్నారు. ఎందుకంటే అర్జున్‌రెడ్డి లో ఉన్నట్టుగానే ఈ సినిమాలో కూడా విజయ్ క్యారెక్టర్ చాలా రఫ్ గా ఉంటుందని సమాచారం. అంతేకాదు అర్జున్‌రెడ్డి కి డియర్ కామ్రేడ్ కి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయట. అవేంటంటే డియర్ కామ్రేడ్ లో కూడా విజయ్ మెడికల్ స్టూడెంట్‌గా నటిస్తున్నాడట. 


ఇక ఈ సినిమాలో విజయ్ ఒక లీడర్ గా పవర్‌ ఫుల్ రోల్ చేస్తున్నాడని టాక్. అంతేకాదు అర్జున్‌రెడ్డి లో విజయ్ ప్రీతి తో రొమాన్స్ చేసినట్టుగా ఇంతకముందు తనతో గీత గోవిందం లో నటించిన రష్మిక మందన్న తోనూ డియర్ కామ్రేడ్ సినిమాలో రొమాన్స్ చేస్తాడట. ఇన్ని సిమిలారిటీస్ ఉన్నందుకే డియర్ కామ్రెడ్ ని అర్జున్‌రెడ్డి తో పోలుస్తున్నారట. మరి సినిమా రిలీజైతే‌గాని అసలు విషయం ఏంటో తెలుస్తుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: