కాంట్రాక్ట‌ర్‌గా కెరీర్ మొద‌లుపెట్టి ఎంతో ఇష్టంతో ఎన్నో క‌న‌ష్ర్ట‌క్ష‌న్ లు విజ‌వంతంగా పూర్తిచేసిన ఘ‌న‌త జి.సీతారెడ్డి. సినిమా పై ఇష్టంతో ప్యాష‌న్‌తో ఇప్పుడు ఇండ‌స్ర్టీకి వ‌చ్చి సినిమాల‌ను నిర్మించ‌డ‌మే కాక మొద‌టి సినిమాతోనే న‌టుడుగా కూడా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సంహిత, చిన్ని-చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మించిన న్యూ జనరేషన్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘ఎంతవారలైనా’. ఇటీవల రిలీజైన ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌కి హ్యూజ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో అద్వైత్‌, జహీదా శ్యామ్‌, అలోక్‌ జైన్‌, జి.సీతారెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు. తెలుగులో మే 17న గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతున్న సందర్భంగా నటుడు, నిర్మాత జి.సీతారెడ్డి ఇంటర్వ్యూ.


కన్‌స్ట్రక్షన్‌ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మీరు ప్రొడ్యూసర్‌గా మారడానికి  కార‌ణం 
నేను ప్రొడ్యూసర్‌గా మారడానికి మెయిన్‌ రీజన్‌ నా క్లాస్‌మేట్‌, దర్శకుడు గురు చిందేపల్లి. ఆ తర్వాత సినిమాలపై నాకున్న ప్యాషన్‌. సినిమాలంటే చిన్నప్పట్నుంచి పిచ్చి. దొంగతనంగా వెళ్ళి సినిమాలు చూసొచ్చేవాళ్లం. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత కన్‌స్ట్రక్షన్‌ రంగంలో బిల్డర్‌గా రాణించి వ్యాపారవేత్తగా స్థిరపడ్డాను. ఒకసారి మా ఇంజనీరింగ్‌ కాలేజ్‌ స్టూడెంట్స్‌ అందరూ గెట్‌ టు గెదర్‌ పార్టీ ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడే నా చిన్నప్పటి మిత్రుడు, క్లాస్‌మేట్‌ గురు చిందేపల్లిని కలవడం జరిగింది. తనకి దర్శకత్వ శాఖలో అనుభవం ఉండటంతో నాకు ఈ కథ చెప్పారు. కథ విన్నప్పుడు నేను కూడా చాలా ఎగ్జయిట్‌గా ఫీలయ్యాను. నాకు కూడా సినిమా ఇండస్ట్రీ అంటే ప్యాషన్‌ ఉండటంతో ఈ సినిమాను నేనే నిర్మిస్తాను అని చెప్పాను. దాని వల్ల నా చిరకాల మిత్రుడికి దర్శకుడిగా అవకాశం కల్పించి హెల్ప్‌ చేసినట్లుంటుంది.. నాకు ఇంటర్నల్‌గా ఉన్న ఆకాంక్ష తీరినట్లుంటుంది అని ఈ సినిమాతో ప్రొడ్యూసర్‌గామారాను.

ఈ చిత్ర క‌థాంశం ఏమిటి?
ఈ స ష్టి ప్రారంభం నుండి మంచి చెడు అనేవి రెండు మార్గాలు ఉన్నాయి. దేవతలు, రాక్షసుల కాలంలో అమ తం కోసం తలపడేవారు. తరవాత రాజులకాలంలో రాజ్యాల కోసం, ఆ తర్వాత నిధులు, నిక్షేపాలకోసం యుద్ధాలు జరిగేవి. అయితే ప్రస్తుత కాలంలో ధనం కోసం దాడులు, హత్యలు జరుగు తున్నాయి, అయితే చెడు మార్గాన్ని ఎంచుకుంటే ఎంతవారలైనా శిక్షార్హులే.. అనే ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది.

దర్శకుడు గురించి?
 గురు చిందేపల్లికి సినిమా రంగంలో పది సంవత్సరాల అనుభవం ఉంది. నేషనల్‌ అవార్డు విన్నర్‌ నరసింహా నందిగారి దగ్గర దర్శకత్వ శాఖలో కోడైరెక్టర్‌గా వర్క్‌ చేశారు. ఆ అనుభవంతో ఈ చిత్రం కథను రెడీ చేశారు. నిర్మాతగా ఇది నాకు మొదటి సినిమా అయినా నా మీద ఎలాంటి ప్రెజర్‌ లేకుండా సినిమాని అనుకున్నది అనుకున్నట్లుగా పర్‌ఫెక్ట్‌గా తెరకెక్కించారు. అలాగే ఈ సినిమాలో నాతో ఒక క్యారెక్టర్‌ చేయించడం జరిగింది.

మీ పాత్ర గురించి 
నాకు చిన్నప్పటి నుండి సినిమాలంటే ఉన్న ఇంట్రెస్ట్‌ని క్యాప్చర్‌ చేసి దర్శకుడు నాతో ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్‌ ఎస్‌.పి. క్యారెక్టర్‌ చేయించారు. ఇది నటుడిగా నాకు మొదటి సినిమా అయినప్పటికీ నిజ జీవితంలో డైనమిక్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ అయిన ఉమేష్‌ చంద్ర, సురేంద్రలాంటి పోలీస్‌ ఆఫీసర్స్‌ స్పిరిట్‌తో.. అలాగే నా అభిమాన నటుడు ఎస్‌.వి రంగారావుగారి స్పూర్తితో ఈ క్యారెక్టర్‌ చేశాను.

మీ పాత్రను స్క్రీన్‌ మీద చూసుకుంటే ఎలా అన్పించింది...
ఎస్‌.పి. క్యారెక్టర్‌ నాకు బాగా నచ్చింది. ఫ్రెండ్స్‌ నుంచి కూడా మంచి అప్లాజ్‌ వచ్చింది. స్క్రీన్‌ మీద ఎస్‌.పి. క్యారెక్టర్‌లో నన్ను చూసి గతంలో పోలీస్‌ ఆఫీసర్లుగా నటించి, మెప్పించిన రాజశేఖర్‌, సాయికుమార్‌లతో పోల్చడం చాలా సంతోషం కలిగించింది.

నటుడిగా మీకు ఇన్‌స్పిరేషన్‌?
 నాకు నటుడిగా ఎస్‌.వి. రంగారావు, కమల్‌హాసన్‌గార్లను అభిమానిస్తాను.

నిర్మాతగా మారడానికి చాలామంది భయపడుతుంటారు కదా!
అలాంటిదేం లేదండీ. చాలామంది వ్యాపార రంగం నుండి నిర్మాతలుగా మారి సక్సెస్‌ సాధించారు. అలాగే కళామతల్లిని నమ్ముకుంటే నష్టపోరు అని నిరూపించారు. దానికి డెడికేషన్‌ ఉండాలి.. దానికి ఉదాహరణ దిల్‌ రాజుగారు. దిల్‌ రాజుగారిని చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. బిజినెస్‌మేన్‌గా ఆయన డెడికేషన్‌ కానీ, నిర్మాతగా కథల విషయంలో ఆయన జడ్జిమెంట్‌కానీ.. చాలా గొప్పది. నిర్మాతగా నాకు రామానాయుడుగారు, బిజినెస్‌పరంగా నాకు దిల్‌ రాజుగారు ఇన్‌స్పిరేషన్‌. ఆయన్ని నేను ఇంతవరకూ కలవలేదు. త్వరలోనే ఆ అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను.

ఈ క‌థ‌లో ఆక‌ట్టుకున్న అంశం...
 ‘ఎంతవారలైనా’ సినిమాకి కథే హీరో అని డెఫినెట్‌గా చెప్పగలను. కమల్‌హాసన్‌గారి సినిమాలు చూస్తే.. పెద్ద ప్యాడింగ్‌ ఉన్నా.. కథానుసారం సినిమా ఉండి ప్రేక్షకులు ఎక్కడా డీవియేట్‌ కాకుండా సినిమాలో నిమగ్నం చేస్తుంది. అలాగే మా సినిమా కూడా కథకి అనుగుణంగా నడుస్తుంది. మంచి, చెడు అనే పాయింట్‌ మీద దర్శకుడు చిందేపల్లి కథను చాలా బాగా చెప్పారు. చాలా బాగా తీశారు కూడా. చనిపోయిన మనిషి చివరిలో పడే వేదనను బాగా చూపించారు. అది ఇప్పుడు రివీల్‌ చేయలేను. మే 17న సినిమా చూసి తెల్సుకోవాల్సిందే. ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో ఆర్టిస్ట్‌ల కష్టం, దర్శకుడి పనితీరు గురించి మాట్లాడతాను.

ఆడియోకి  రెస్పాన్స్ గురించి...
ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదలైన మా ‘ఎంతవారలైనా’ చిత్రం ఆడియోకి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. అన్ని జనరేషన్స్‌ వారు మా సాంగ్స్‌ని మెచ్చుకుంటున్నారు. సంగీత దర్శకుడు సుక్కు అదిరిపోయే సంగీతంతో పాటు మంచి రీరికార్డింగ్‌ ఇచ్చారు.

షూటింగ్‌ ఎక్కడెక్కడ చేశారు?
 హైదరాబాద్‌, మైసూర్‌, బెంగళూరు, చిక్‌మంగళూరులోని అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. అలాగే నాకు మొదటి సినిమా అయినా నా టీం అందరు నాకెంతగానో సపోర్ట్‌ చేశారు. సాంగ్స్‌ అన్ని ఫారిన్‌ లొకేషన్స్‌లో లాగా చాలా రిచ్‌గా, బ్యూటిఫుల్‌గా కన్పిస్తాయి.

నటించిన హీరోహీరోయిన్ల గురించి...
 ఈ చిత్రంలో హీరో అద్వైత్‌. తనకి కన్నడంలో మంచి పెర్‌ఫార్మర్‌గా పేరుంది. అలాగే హీరోయిన్‌ జహీదా తొలిసారిగా పోలీస్‌ ఆఫీసర్‌గా నటించి మెప్పించింది. అలీషా ఐటెమ్‌ సాంగ్‌తో తనకంటూ ఓ స్పెషల్‌ ఐడెంటిటీ తెచ్చుకుంది. వారితో పాటు ఇటీవలకాలంలో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అలోక్‌ జైన్‌ ఈ సినిమాలో నెగిటివ్‌ రోల్‌లో కన్పిస్తారు. ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు అద్భుతంగా నటించారు.

ఈ సినిమాలో మీకు హీరోయిన్‌ ఉందా...
 నా క్యారెక్టర్‌ చుట్టూ సినిమా తిరుగుతుంటుంది. నాకు హీరోయిన్‌ లేదు.

ఇతర టెక్నీషియన్స్‌ గురించి...
ఈ సినిమా మేం అనుకున్నప్పటి నుండి అన్నీ బాగా కుదిరాయి. ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి బ్యూటిఫుల్‌ ఫొటోగ్రఫీ అందించారు. అతను ఇదివరకే బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌గా నంది అవార్డు తీసుకున్న విషయం తెలిసిందే. ఎడిటర్‌ వి.నాగిరెడ్డిగారు ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు పనిచేశారు. డ్యాన్స్‌, ఫైట్స్‌ కూడా మంచి పేరున్న టెక్నీషియన్స్‌ మా సినిమాకు ప్రాణం పెట్టి వర్క్‌ చేశారు. నా ఫస్ట్‌ మూవీనే సూపర్‌ ప్రోడక్ట్‌లా వచ్చిందని చెప్పాలి.

సినిమాలో హైలైట్స్‌?
 మా సినిమాలో ముఖ్యంగా స్టోరి, సాంగ్స్‌ హైలైట్‌గా నిలుస్తాయి. అలాగే దర్శకుడు ప్రతి క్యారెక్టర్‌కి ఓ స్పెషల్‌ ఐడెంటిటీ ఇస్తూ అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారు.

నిర్మాతగా కొనసాగుతారా! లేక నటుడిగానా?
నటుడిగా ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు అడుగుతున్నారు. ఈ సినిమా విజయం పట్ల ధీమాగా ఉన్నాం. సినిమా విడుదలయ్యాక మిగతా ప్రాజెక్ట్స్‌ గురించి ఆలోచిస్తాను. నటుడుగా నేను న్యాయం చేయగలిగే పాత్రలు చేయడానికి నేనెప్పుడూ సిద్దమే..

రిలీజ్‌ ఎప్పుడు ప్లాన్‌ చేస్తున్నారు?
మా చిత్రం ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. మా సినిమా చూసి సెన్సార్‌ సభ్యులు అభినందించారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మించాం. తెలుగులో మే 17న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. కన్నడలో కూడా త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.. అంటూ ఇంటర్వూ ముగించారు నటుడు, నిర్మాత జి.సీతారెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: