పూరి జగన్నాధ్.. పోకిరి, బిజినెస్‌మెన్‌, టెంపర్ లాంటి సినిమాలు. ఇక అలాంటి గొప్ప ద‌ర్శ‌కుడు ఇటు యంగ్ హీరో రామ్ కాంబోలో సినిమా అంటే ఓ మోస్త‌రు అంచ‌నాలే ఉంటాయ్‌. గ‌తంలో హార్ట్ఎటాక్ లాంటి యావ‌రేజ్ సినిమా కూడా వీరిద్ద‌రు క‌లిసి చేశారు. ఇప్పుడు మళ్లీ ఐదేళ్ల త‌ర్వాత అదే కాంబినేష‌న్ అంటే థియేట్రిక‌ల్ రైట్స్ త‌క్కువ‌లో త‌క్కువ‌గా ఎంత లేద‌న్నా రూ.20-25 కోట్లు ఉంటాయ్‌. 


కానీ ఇస్మార్ట్ శంక‌ర్ ప్రి రిలీజ్ బిజినెస్ గురించి ఇండ‌స్ట్రీలో జ‌రుగుతోన్న చ‌ర్చ చూస్తుంటే చాలా జాలేస్తోంది. భారీ ఆఫ‌ర్ వ‌చ్చే సీన్ లేద‌ట‌. అందుకే ఓవ‌రాల్‌గా ఆల్ ఇండియా వైజ్‌గా థియేట్రిక‌ల్ రైట్స్‌ను రూ.15 కోట్ల‌కు కోట్ చేస్తే.. బ‌య్య‌ర్లు మేం అంత ఇవ్వ‌లేం... రూ.12 కోట్లు అయితే ఓకే అని అన్న‌ట్టు భోగ‌ట్టా.  ఆంధ్ర, సీడెడ్, తెలంగాణ, కర్ణాటకలు మెయిన్ మార్కెట్. 12 కోట్ల రేంజ్ అంటే చాలా త‌క్కువే.


అంతెందుకు రాజ‌శేఖ‌ర్ క‌ల్కి సినిమా హ‌క్కులే కేవ‌లం ఏపీ, సీడెడ్‌, నైజాం, ఓవ‌ర్సీస్ క‌లిపి రూ.12 కోట్ల‌కు అమ్మారు. ఇంకా క‌ర్ణాట‌క ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నాయ్‌. మ‌రి అలాంటిది రామ్ - పూరి కాంబో సినిమాకు ఇండియా వైజ్ రైట్స్ రూ.12 కోట్ల‌కు కూడా క‌ష్టంగా అంటే రామ్‌, పూరి ప‌రిస్థితి చూస్తే జాలి ప‌డాల్సిందే. వాస్త‌వంగా ఈ సినిమాను ముందుగా ఈ నెల చివ‌ర్లో రిలీజ్ అన్నారు. ఇంకా చాలా ప్యాచ్ వ‌ర్క్ ఉంద‌ట‌. అందుకే జూలై లేదా ఆగ‌స్టుకు వెళ్లిపోవ‌చ్చంటున్నారు. ఏదేమైనా ఒక‌ప్పుడు పోకిరి, బిజినెస్‌మేన్‌, టెంప‌ర్ లాంటి సినిమాలతో రూ.50-60 కోట్ల మార్కెట్ చూసిన పూరి ఇప్పుడు రూ.12 కోట్ల‌కు ప‌డిపోవ‌డానికి నాసిర‌కం క‌థ‌ల‌తో సినిమాలు తీయ‌డ‌మే. 


మరింత సమాచారం తెలుసుకోండి: