ఒకప్పుడు దూరదర్శన్ లో వచ్చే సీరియల్స్ లో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు టాప్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల.   ప్రస్తుతం టాప్ యాంకర్ గా కొనసాగుతుంది సుమ.  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాజీవ్ కనకాల నటిస్తున్నారు.  తాజాగా వంశి పైడిపల్లి, మహేష్ బాబు నటించిన ‘మహర్షి’సినిమాలో రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషించారు. 

తాజాగా రాజీవ్ కనకాల ఓ ఇంటిర్వ్యూలో మాట్లాడుతూ..మహర్షిలో తన క్యారెక్టర్ నెగిటీవ్ షేడ్స్ లో కనిపించినా..మంచి పేరు మాత్రం వచ్చిందని అంటున్నారు.  ఈ సందర్భంగా తన లైఫ్ లో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతూ..సుమతో ఎలా పరిచయం ఏర్పడింది..ఎలా పెళ్లి అయ్యిందన్న విషయం తెలిపారు. మేఘమాల సీరియల్ లో సుమ హీరోయిన్.. అది మా నాన్నగారే తీశారు.

అందులో నాది చాలా చిన్న పాత్ర.  అయితే మేఘమాల సీరియల్ కన్నా ముందు ఒకరోజు సుమను చూశానని..నేను డైరెక్ట్ చేసిన సీరియల్ కోసం ఎడిట్ సూట్ కి వెళ్లా.. అదే సమయంలో సుమ కూడా అక్కడకి వచ్చింది అక్కడ ఆమెని చూసి ఇంప్రెస్ అయ్యా అంటూ చెప్పుకొచ్చారు. తన లవ్ ప్రపోజల్ చెప్పినా..సుమ పట్టించుకోలేదని దాంతో నాకు ఎంతో బాధ కలిగిందని అన్నారు. 

అయితే మూడు రోజుల తర్వాత సుమ ఫోన్ చేసి ప్రేమకు ఓకే చెప్పింది.  అయితే ఏడాదిన్నరమే మా ప్రేమకు బ్రేకప్ చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందని..పెళ్లికి ముందే ఆంక్షలు పెడుతున్నానని ప్రేమించిన ఆరు నెలలకే బ్రేకప్ చెప్పేసిందని ఎంత ప్రాధేయ పడినా తాను ఒప్పుకోలేదని..ఆ తర్వాత తన మనసు మార్చుకొని  1998లో నాతో ప్రేమ కొనసాగించిన నెల రోజులకే మా పెళ్లి అయిపోయిందని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: