నాగార్జున మన్మధుడు సినిమా ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. నాగ్ నటన తనకోసమే రాసారా అన్న అందమైన భామలు అన్న పాట అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా నాగ కెరీర్ లోనీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే నాగార్జున ఫిట్నెస్. అప్పడెప్పుడో వచ్చిన మన్మధుదు సినిమా లో ఏలా కనిపించాడో ఇప్పుడూ సీక్వెల్ లోను అలానే ఉన్నాడు నాగ్, నిజం చెప్పాలంటే చూసే వాళ్ళు అప్పటిమీద వయసు తగ్గిందా ఏంటి అనుకోక తప్పదు.


60 ఏళ్ళ వయసులో కూడా యంగ్ హీరోలకు పోటిగా కనిపిస్తున్నారు నాగ్. ప్రతి సినిమాకు తనకు తాను విభిన్నంగా మార్చుకోవడం నాగ్ ప్రత్యేకత. సమయపాలన, క్రమశిక్షణతో కూడిన ఫిట్నెస్ గోల్స్ తో నాగ్ 60ఏళ్ళలో కూడా 20ఏళ్ళలా కనిపిస్తూ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులని చేస్తున్నారు.

Image result for nagarjuna images

తాజాగా మన్మధుడు చిత్రం సీక్వెల్ లో తన స్టిల్స్ తో అందర్ని షాక్ కి గురిచేసారు. రాహుల్ రవీంద్రన్ దర్సకత్వంలో ఈ చిత్రం ఒక రొమాంటిక్ డ్రామాగా తెరకేక్కబోతుంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పోర్చగల్ లో జరుగుతుందట.

తాజాగా ఈ సినిమాలో మహానటి ఫేం కీర్తి సురేష్ ని కూడా హీరోయిన్ గా తీసుకున్నారట. మొత్తానికి మన్మధుని పక్కన మెరుపు తీగల హుంగమ మొదలైంది అని చెప్పుకోవచ్చు. కీర్తి సురేష్ తన నటన తో తమిళ, తెలుగు, మలయాళం ఇండస్ట్రీ లలో మంచి పేరు సంపాదించింది. త్వరలో మనం నాగ్ ని మొరోసారి మన్మధుడిగా చూడబోతున్నాం అన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: