మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. కలెక్షన్ల పరంగా, క్రిటిక్స్ పరంగా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మహేష్ ఖాతాలో వరసగా రెండో హిట్ పడింది. ఈ సినిమా హిట్ కావడంతో అనిల్ రావిపూడితో చేయబోతున్న తన నెక్స్ట్ సినిమాపై దృష్టి సారించాడు.


అనిల్ రావిపూడి సినిమాలు సాధారణంగా ఎంటర్టైనింగ్ వేలో ఉంటాయి. మహేష్ సినిమా కూడా కమెర్షియల్ ఫార్మాట్ తో పాటు ఎంటర్టైనింగ్ కూడా మిక్స్ చేసి ఉంటుందట. జూన్ లో ప్రారంభించి జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారట.


మహేష్ బాబు కూడా తన నెక్స్ట్ సినిమాకు తగిన విధంగా బాడీ లాంగ్వేజ్ ను చేంజ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. మహేష్ ను చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: