"భాగమతి" సక్సెస్ తర్వాత అనుష్క కొత్త సినిమాల విషయంలో ఎంతకీ క్లారిటీ రావడం లేదు. అయితే కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్ నిర్మాణంలో నూతన దర్శకుడు తెరకెక్కించే సినిమాతో పాటు "సైలెన్స్" అనే ఇండో అమెరికన్ ఫిలిం మాత్రమే అనుష్క ఒప్పుకున్నట్టు ఇప్పటిదాకా ఉన్న అప్ డేట్. తాజాగా మరో రెండు చారిత్రాత్మక సినిమాలలో "అనుష్క" నటించబోతోందనే వార్త ఇప్పుడు టాలీవుడ్లో తెగ హల్‌చల్ చేస్తున్న వార్త. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "సైరా" అని సమాచారం. 


దాని ప్రకారం "సైరా నరసింహరెడ్డి"లో ఒక థీమ్ సాంగ్ కోసం అనుష్క ఓకే చెప్పినట్టుగా తెలిసింది. అయితే టీమ్ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. స్వీటీ గతంలో చిరుతో "స్టాలిన్" లో ఓ స్పెషల్ సాంగ్ కోసం కాలు కదిపింది. దాని తర్వాత ఈ కాంబినేషన్ సాధ్యపడలేదు. "సైరా" తర్వాత "ఆర్ ఆర్ ఆర్" లోను చాలా కీలకంగా అనిపించే ఓ క్యారెక్టర్ కూడా స్వీటీ చేయబోతున్నట్టు మరో న్యూస్. 


"బాహుబలి" రెండు భాగాలూ "విక్రమార్కుడు" ఇలా అనుష్కతో రాజమౌళి కాంబినేషన్ మంచి బాండింగ్ సెట్ చేసింది. సో జక్కన్న అడిగితే అనుష్క కాదనే ప్రసక్తి ఉండకపోవచ్చు. ఇదీ అఫీషియల్ గా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనక నిజమైతే రెండు సినిమాలకు మరో ఆకర్షణ తోడవుతుంది. మరీ ఈ రెండు బారీ ప్రాజెక్ట్స్ కి సంబందించిన అప్‌డేట్ అనుష్క స్వయంగా ఇస్తే మాత్రం ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: