టివి 9 రవిప్రకాష్ ను ఆ ఛానల్ కొత్త యాజమాన్యం ఆ సంస్థ నుండి తొలిగించిన వివాదం ఎన్నికల ఫలితాల కంటే మన తెలుగు రాష్ట్రాలలో హాట్ న్యూస్ గా మారింది. ఈ విషయమై అనేకమంది ప్రముఖులు అనేక విధాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో మెగా బ్రదర్ నాగబాబు ఈవిషయమై ఊహించని విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఒక మీడియా సంస్థ ప్రతినిధి నాగబాబును టివి 9 వివాదం పై ప్రశ్నించినప్పుడు ఆయన కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు టాక్. గతంలో టివి 9 సంస్థకు ప్రజారాజ్యం సమయంలో చిరంజీవికి కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ కు కొన్ని విషయాల పై కొంత గ్యాప్ ఏర్పడిన రీత్యా ఆ మీడియా సంస్థ అడిగిన ప్రశ్న పై నాగబాబు ఒక షాకింగ్ రిప్లయ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

మొదటి నుండి ఒక్క టివి 9 మాత్రమే కాకుండా చాల మీడియా సంస్థలు మెగా ఫ్యామిలీ పై ఏమాత్రం జాలి చూపించలేదనీ అనేక నెగిటివ్ వార్తలను ప్రసారం చేయడం ద్వారా కొన్ని చానళ్ళు పత్రికలు ‘ప్రజారాజ్యం’ సమయం నుండి ‘జనసేన’ వరకు తమ ఫ్యామిలీని టార్గెట్ చేయడమే ఒక పనిగా పెట్టుకున్న విషయాన్ని నాగబాబు గుర్తుకు చేసుకున్నట్లు టాక్. అయితే ఫోర్త్ ఎస్టేట్ గా పేరు గాంచిన మీడియా తమ పై నెగిటివ్ ప్రచారం చేసినా ఫిఫ్త్ ఎస్టేట్ గా పేరుగాంచిన సోషల్ మీడియాలో మెగా అభిమానులు ఎప్పుడు తమను కాపాడుతూ వచ్చారనీ నాగబాబు అభిప్రాయ పడినట్లు సమాచారం. 

ఇప్పుడు ఈకామెంట్స్ మీడియా వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. చిరంజీవి పవన్ కళ్యాణ్ తో పాటు మెగా హీరోల అందరి ఎదుగుదల వెనుక మీడియా సపోర్ట్ లేకుండానే ఎదిగిపోయారా అంటూ కొందరు కామెంట్స్ చేయడమే కాకుండా ప్రతిఒక్కరు తాము అవివేకంతో చేసిన పొరపాట్లకు మీడియాను టార్గెట్ చేయడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది అంటూ మరికొందరు నాగబాబు కామెంట్స్ పై రివర్స్ కామెంట్స్ చేస్తున్నట్లు సమాచారం..  


మరింత సమాచారం తెలుసుకోండి: