హీరో రాజశేఖర్ కు అప్పట్లో మంచి క్రేజే ఉండేది. అల్లరి ప్రియుడు, సింహరాశి వంటి సినిమాలు ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు. అయితే ఇప్పుడు ఉన్న యువ జనరేషన్ కి తగ్గట్టుగా తనని తాను మలుచుకోలేకపోయాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే తన జనరేషన్ హీరోలు అందరు ఇప్పటి యూత్ కి అనుగుణంగా వాళ్ళని మార్చుకుంటున్నారు. రాజశేఖర్ మాత్రం ఆ మార్పుని పూర్తిగా తీసుకుని రాలేకపోయాడు.


అయితే రాజశేఖర్ కి ఈ మధ్యలో బ్రేక్ ఇచ్చింది “గరుడు వేగా" సినిమానే అని చెప్పాలి. యాక్షన్, కమర్షియల్ ఎలెమెంట్స్ తో ప్రేక్షకుల మనసుల్ని గెలిచాడు. రాజశేఖర్ సినిమాలు కూడా చూడొచ్చు అని యూత్ అభిప్రాయపడేలా చేసాడు. "గరుడ వేగా" సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ పరిశ్రమలో కూడా బాగా వెళ్ళింది. చాలకాలం తరువాత రాజశేఖర్ కెరీర్ మళ్ళి ఈ సినిమాతో గాడిలో పడింది అనే చెప్పాలి.

Image result for hero rajasekhar images

అయితే తాజాగా రాజశేఖర్ మరో కొత్త కమర్షియల్ కధాంశంతో మన ముందుకు రాబోతున్నాడు. ప్రశాంత్ శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ “కల్కి” ఇదొక యాక్షన్, థ్రిల్లర్ గా రుపొందించారట. ట్రైలర్ మొన్న గురవారం రిలీజ్ చేసారు. భాగవద్గీతలో “పార్ధ..కర్మలను ఆచరించుటయందు నీకు అధికారం కలదు ...దాని ఫలితం పై కాదు" అనే డైలాగుతో మొదలై ఇన్వెస్టిగేషన్ బిగిన్స్ అని ఎండ్ అయింది.


అయితే మొత్తానికి ట్రైలర్ మాత్రం అందరిని ఆకర్షించింది. రాజశేఖర్ మరోసారి పోలీస్ లుక్ లో కనపడతారు. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన రాజశేఖర్ ఇమిటేషన్ డైలాగు సీను చాల బాగుంది అని రాజశేఖర్ అభిప్రాయపడ్డారట. "కల్కి" సినిమా శివానీ సమర్పణలో హ్యాపి మూవీస్ బ్యానేర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. రాజశేఖర్ పక్కన అదా శర్మ, నందిత శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: