యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లి షాలిని అని మాత్రమే తెలుసు. ఆమె వైపు బంధువులు ఎవరో ఎపుడూ తెలియదు. ఆమెది కర్నాటక అన్నది మాత్రం తెలుసు. ఇక  ఎన్టీఆర్ నాన్నగారు నందమూరి హరిక్రిష్ణ తాత సీనియర్  ఎన్టీఆర్ ఇలా అందరూ తెలుసు. మరి జూనియర్ తల్లి తరఫున ఎవరైనా ఉన్నారా వారితో జూనియర్ రిలేషన్స్ ఎలా ఉంటాయన్నది తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది.


ఇపుడు జూనియర్ చేసింది అదే. తన తల్లి బంధువులతో ఉన్న ఫొటోను ఒకటి రిలీజ్ చేసి అభిమానులకు, ప్రేక్షకులను కూడా సర్ప్రైజ్ చేశాడు. ఈ మధ్య ఆర్ ఆర్ ఆర్ షూటింగులో గాయప‌డిన యంగ్ టైగర్ ఎన్టీఆర్  విశ్త్రాంతి తీసుకుంటున్న సంగతి విధితమే. అందువల్ల ఆతను ఇపుడు సమ్మర్ ట్రిప్ గా బంధువుల ఇళ్ళకు వెళ్తున్నాడు. అందులో భాగంగా తల్లి షాలిని తరఫు వారిని కలుసుకున్నాడు.


కర్నాటకకు వెళ్ళిన జూనియర్ తన భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులతో తల్లితో  కలసి  వారి బంధువులతో చాలా ఆనందంగా గడిపినట్లుగా తెలుస్తోంది. అందరితో కలిపి తీయించుకున్న  ఫొటోను ఎన్టీఆర్  విడుదల చేయడంతో జూనియర్ తల్లి కుటుంబంతో ఎంత బాగా ఉంటాడన్నది ఇపుడు అందరికీ అర్ధమైంది. అన్నట్లు జూనియర్ గాయం ఇంకా మానలేదనడానికి చేతికి కట్టు అలాగే ఉందని ఫొటోను చూస్తే   తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: