ఎన్నికల తరువాత మౌనంగా ఉన్న పవన్ నిన్న ప్రముఖ రాజకీయ నాయకుడు ఎస్పీవై రెడ్డి మృతి సందర్భంగా నంద్యాల వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన సందర్భంలో తనను కలిసిన ఒక మీడియా సంస్థ ప్రతినిధితో పవన్ తన మౌనం వీడి తన మనసులోని మాటలను బయటపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళి గురించి స్పందిస్తూ తనకు ప్రజలలో వచ్చిన ఓటింగ్ చైతన్యం స్పష్టంగా కనిపించింది అనీ ఇది మార్పుకు సంకేతం అన్న అభిప్రాయం వ్యక్తం చేసాడు.

అయితే ఇదే సందర్భంలో తన ‘జనసేన’ కు ఎంత శాతం ఓట్లు పడతాయి ఎన్ని సీట్లు వస్తాయి అన్న విషయమై ఇప్పుడు తాను చెప్పలేననీ ఫలితాలు ఎలా వచ్చినా తాను ఆ ఫలితాలను మౌనంగా అంగీకరించి తాను భవిష్యత్ లో కూడ ప్రజాసేవలో కొనసాగుతాను అన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. ఇదే సందర్భంలో పవన్ మాట్లాడుతూ గాజువాక భీమవరం ప్రాంతాలలో తనకు ఎంత మెజార్టీ వస్తుంది అన్న విషయం పైనా కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయం పైనా తాను ఊహాగానాలు చేయనని మరికొన్ని రోజులలో ఎన్నికల ఫలితాలు రాబోతున్న పరిస్థుతులలో ఊహాగానాలు అనవసరం అన్న అభిప్రాయం వ్యక్త పరిచాడు.

ఇక్కడ మరొక ట్విస్ట్ ఇస్తూ పవన్ చంద్రబాబునాయుడు మాటలకు సంఘీభావం తెలుపుతూ చేసిన కామెంట్స్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల కౌంటింగ్ సమయంలో వివిప్యాట్ లకు సంబంధించిన స్లిప్ లను కనీసం 50 శాతం కౌంట్ చేయాలి అని ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమానికి తాను తన సంఘీభావాన్ని తెలియచేస్తున్నాను అంటూ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.

ఇది ఇలా ఉంటే పవన్ నంద్యాలలో చేసిన ఈ కామెంట్స్ ను ప్రముఖంగా టివి9 ఛానల్ ప్రసారం చేయడం మరింత ఆశ్చర్యంగా మారింది. టివి 9 యాజమాన్యం మారిన తరువాత పవన్ కామెంట్స్ కు ప్రాముఖ్యత ఇస్తూ నిన్నరాత్రి అనేక సార్లు పవన్ వ్యాఖ్యలను తమ ఛానల్ లో చూపెట్టడం ద్వారా ఈ ఛానల్ కొత్త యాజమాన్యం పవన్ తో రానున్న రోజులలో సన్నిహిత సంబంధాలు కోరుకుంటోంది అన్నవిషయానికి సంబంధించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది..   
 


మరింత సమాచారం తెలుసుకోండి: