‘అ’ అక్షరం పలకడం నేర్పిన తొలి గురువు అమ్మ నక్షత్రాలను చూపించి గోరు ముద్దలు తినిపించిన అమ్మలు ఒకనాడు ఉంటే ఇప్పటి అమ్మలు తమ పిల్లల సక్సస్ కోసం అనుక్షణం పరితపిస్తూ వారివారి స్థాయిలలో ఇప్పటికీ తమ పిల్లలే జీవితంగా జీవిస్తున్నారు. అందుకే ‘అమ్మను మించిన దైవం లేదు’ ఏ దేశంలో అయినా ఏ సమాజంలో అయినా కుటుంబంలో అమ్మ కీలకం ఆమె సర్వస్వం. 

ఇలాంటి పరిస్థుతులలో నేడు జరుగుతున్న ‘మదర్స్ డే’ సందర్భంగా అమ్మ తీపి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ ఎందరో ఫిలిం సెలెబ్రెటీలు తమ తల్లుల గురించి తెలియచేసారు. అయితే ముఖ్యంగా మెగా యంగ్ హీరో సాయి తేజ్ తన తల్లి గురించి చెప్పిన మాటలు ఈ మదర్స్ డే నాడు హైలెట్ గా మారాయి. తమ చిన్నతనంలో ఎన్ని కష్టాలు ఎదురైనా తనను తన తమ్ముడు వైష్ణవ తేజ్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచిన తన తల్లి చేసిన త్యాగాలను తలుచుకుంటే తనకు కన్నీళ్లు వస్తాయని ఉద్వేగంగా చెప్పాడు.

అంతేకాదు తనకు తన తల్లి ఒక మాతృ మూర్తి మాత్రమే కాకుండా ఒక ఫ్రెండ్ ఒక గైడ్ గా ఆమె అందించిన సహకారం లేకపోతే తాను ఇండస్ట్రీలో ఇప్పటికే కనుమరుగు అయిపోయి ఉండేవాడిని అంటూ తన తల్లి గురించి సాయి తేజ్ ఆవేదనతో అనేక విషయాలు షేర్ చేసాడు. ఇదే సందర్భంలో రకుల్ ప్రీత్ పూజ హెగ్డే లావణ్య త్రిపాఠీ ఎన్నో విషయాలు తమ తల్లుల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు షేర్ చేస్సారు. 

ఇక ఈ మదర్స్ డే సందర్భంగా మహేష్ భార్య నమ్రత షేర్ చేసిన విషయాలు ఆమె సంస్కారాన్ని సూచిస్తున్నాయి. తాను తన తల్లి నుండి ఏమి నేర్చుకున్నానో అదే తన పిల్లలు గౌతమ్ సితారలకు నేర్పిస్తున్నానని తనకు విలువలు లేని జీవితం పట్ల పెద్దగా ఆసక్తి లేదనీ అందువల్లనే అదే విలువలు గురించి గౌతమ్ సితారలకు చెపుతున్నానని అంటూ తాను సూపర్ స్టార్ భార్యను అయినా తన పిల్లల విషయంలో మాత్రం ఒక మంచి తల్లిగా ఉండాలని తాను పడుతున్న తాపత్రయాన్ని వివరించింది. ఇలా బ్రిటీష్ యువరాజు హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్ నుండి సాధారణ అమ్మల వరకు ఈరోజు జరుగుతున్న ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా తాము తమ తల్లుల నుండి పొందిన స్పూర్తిని వివరించారు. అయితే మారుతున్న పరిస్థుతులలో రానురాను యాంత్రిక జీవితం పెరిగిపోతున్న నేపధ్యంలో జీవితపు చరమాకంలో ఉన్న అమ్మకు తోడుగా ఉండగలిగితేనే జీవితానికి సార్ధకత అన్న భావం ఈ మదర్స్ డే నేటి యువతకు కలిగించాలని మనస్పూర్తిగా కోరుకుందాం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: