ఏవరు ఏప్పుడు సినీ రంగ ప్రవేశం చేస్తారో అంచనా వేయలేం. అలానే ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మేనేజర్ కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ అవతారామేత్తారు. ‘మను చరిత్ర’ అనే చిత్రాన్ని ఈరోజు ఉదయం లాంచనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశాన్ని కాజల్ క్లాప్ కొట్టారు. సి.కళ్యాణ్ కెమెరా స్టార్ట్ చేసారు. అజయ్ భూపతి ముహూర్తపు సన్నివేశాన్ని డైరెక్ట్ చేశారు.


ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు కూడా పెద్దవాటికంటే కుడా మంచి హిట్ లు కొడుతున్నాయి. మంచి కధ దర్శకత్వం వంటి అంశాలపై ద్రుష్టి పెడితే తప్పకుండ ప్రేక్షకుల ఆదరణ పొందవచ్చు. చాల సినిమాలు అలానే బాక్స్ ఆఫీస్ వరకు చేరలేకపోయిన ఒక సుమారు హిట్ లతో ముందుకు సగుతున్నాయే.
నిజం చెప్పాలంటే చిన్న సినిమాల మీద వస్తే పెట్టుబడి పైన లాభం వస్తుంది లేకపోతె పెట్టుబడిలో ఎంతోకొంత వస్తుంది. భారీగా మాత్రం నష్టం జరగదు అనే చెప్పాలి. ఏటొచ్చి పెద్ద సినిమాలు అయితే పెద్దమొత్తంలోనే లాస్ అయిన ప్రాఫిట్ అయిన వస్తుంది. ఇప్పుడుప్పుడే ఇండస్ట్రీలో మొదలైనవారికి చిన్న తరహ ప్రయత్నమే తెలివైన నిర్ణయం.

Image result for kajal agarwal images

మను చరిత్ర సినిమాకు సుదీర్ వర్మ, సాహు గారపాటి స్క్రిప్ట్ ను అందించారు. ఈ కార్యక్రమంలో కాజల్ అగర్వాల్, అనిల్ సున్కర్, రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్, శివ నిర్వాణ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సినిమాలో రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్నారు. భారత్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు గోపిసుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ నెలాఖరు నుండి రెగ్యులర్ గా షూటింగ్ ప్రారంభం కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: