F2 సినిమాతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా ఇటీవల  Disney లైవ్ యాక్షన్ రీమేక్ 1992 సినిమాకి 'అల్లావుద్దీన్' క్యారెక్టర్ కి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వాయిస్ ఇవ్వగా జీని పాత్రకు విక్టరీ వెంకటేష్ వాయిస్ అందించారు. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ వాయిస్ ఇస్తున్న 'జీని' పాత్రను హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ చేయడం జరిగింది.

Related image

ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్ నగరంలో జరగగా...ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ విల్ స్మిత్ చేసిన క్యారెక్టర్ చాలా అద్భుతం అని కానీ డబ్బింగ్ చేస్తున్న సమయంలో చాలా ఇబ్బందులు పడ్డామని ఒకానొక సమయంలో డబ్బింగ్ స్టూడియో నుండి కోపం వచ్చి బయటకు వచ్చేయడం జరిగిందని..

Image result for venkatesh

కానీ అక్కడ ఉన్న సినిమా యూనిట్ కొంత సముదాయించడం తో ...ఖచ్చితంగా వచ్చిన ఆ కష్టమైన డబ్బింగ్ ఛాలెంజ్ గా తీసుకుని చేయడం జరిగిందని వెంకటేష్ తెలిపారు. ఇదే సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ నాకు చిన్నప్పటినుండి ఇష్టమైన పాత్ర అల్లావుద్దీన్ రావడంతో...ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ఈ నెల 24వ తారీఖు న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: