ప్రపంచ వ్యాప్తంగా మహర్షి సినిమా సూపర్ హిట్ టాక్ తో భారీ వసూళ్లు చేస్తున్న సంగతి తెలిసిందే.  ఓవర్సీస్ లో ఎవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా కారణంగా వసూళ్లు తగ్గినా.. వీకెండ్ లో తప్పకుండా అక్కడ కలెక్షన్లు భారీగా ఉంటాయని ట్రేడ్ వర్గాల అంచనా.   ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. వసూళ్ల పరంగా సినిమా దూసుకుపోతున్నది.  


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో నాన్ బాహుబలి రికార్డును సాధించిన సంగతి  తెలిసిందే.  వీకెండ్ లో ఈ వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది.  బి.సి సెంటర్స్ లో మహేష్ హవా కొనసాగుతుండటం విశేషం.  ఆంధ్రప్రదేశ్ తో పాటు నైజాంలో కూడా ఈ సినిమా రికార్డ్ వసూళ్లు సాధిస్తోంది.  


నైజాంలో ఇప్పటి వరకు బాహుబలికి మాత్రమే సాధ్యమైన అరుదైన రికార్డును మహేష్ మహర్షి సొంతం చేసుకుంది.  మూడో రోజు థియేటర్స్ టికెట్  కౌంటర్ల ద్వారా ఈ సినిమా ఏకంగా రూ. 3.47 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ల షేర్ ను వసూలు చేసింది.  మూడోరోజు ఈ స్థాయిలో కేవలం బాహుబలి 2 కి మాత్రమే ఉంది.

  ఇప్పుడు ఈ రికార్డును మహర్షి సొంతం చేసుకుంది.  మూడు రోజుల్లో ఈ సినిమా నైజాంలో 13.14 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తోంది.  ఇదే హవా కొనసాగితే మహర్షి వరల్డ్ వైడ్ గా రూ. 200 కోట్ల రూపాయలను వసూలు చేయడం పెద్ద విశేషం ఏమి కాదు. 


తమిళనాడులోని చెన్నైలో కూడా వసూళ్లు నిలకడగా ఉన్నాయి.  స్పైడర్ తరువాత మహేష్ కు చెన్నైలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.  ఒక హిట్ తరువాత నెక్స్ట్ సినిమా మహేష్ కు కలిసిరాదు అనే అభిప్రాయాన్ని మహర్షి తుడిచివేసింది.  నెక్స్ట్ చేయబోయే అనిల్ రావిపూడి సినిమాపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.  చూద్దాం అనిల్ ఏం చేస్తాడో..


మరింత సమాచారం తెలుసుకోండి: