టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది.  సీనియర్ నిర్మాత, పారిశ్రామికవేత్త బి.వెంకట్రామిరెడ్డి (75) నేడు కన్నుమూశారు.   గతకొంత కాలంగాఅనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రామిరెడ్డి విజయా సంస్థ అధినేత నాగిరెడ్డి కుమారుడు . దక్షిణాదిన అజరామరమైనచిత్రాలను అందించిన గొప్ప సంస్థ విజయా ప్రొడక్షన్స్ . నాగిరెడ్డి – చక్రపాణి ల భాగస్వామ్యంలో సంచలనాత్మక సినిమాలు వచ్చాయి . అయితే మధ్యలో చాలాకాలం పాటు సినిమాలకు దూరమైంది ఆ సంస్థ . 


వెంకట్రామిరెడ్డికి భార్య భారతిరెడ్డి, కుమారుడు రాజేష్‌రెడ్డి, కుమార్తెలు ఆర్యనరెడ్డి, అర్చనరెడ్డి ఉన్నారు. వెంకట్రామిరెడ్డి అంత్య క్రియలు సోమవారం ఉదయం 7 నుంచి 9.30 గంటల మధ్య చెన్నైలో జరగనున్నాయి.  బాలకృష్ణ తో భైరవద్వీపం , రాజేంద్ర ప్రసాద్ తో బృందావనం సినిమాలు తెలుగులో నిర్మించాడు . అయితే తెలుగులో కంటే తమిళ్ లోనే ఎక్కువ సౌలభ్యం ఉందనుకున్నాడో ఏమో ! ఆ తర్వాత ఎక్కువగా తమిళ్ లోనే చిత్రాలను నిర్మించాడు. 


గత కొంత కాలాంగా ఉత్తమ నిర్మాతలను ప్రోత్సహించేందుకు తండ్రి బి.నాగిరెడ్డి పేరిట ప్రతియేటా పురస్కారాలను అందిస్తున్నారు. ఇలాంటి మంచి నిర్మాతను కోల్పోవడంతో ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. వెంకట్రామిరెడ్డి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. 







మరింత సమాచారం తెలుసుకోండి: