చిరంజీవి కుటుంబ సభ్యులకు ఉన్నంత స్థాయిలో మోహన్ బాబు కుటుంబ సభ్యులకు వ్యాపారాలు లేవు. అయితే మోహన్ బాబు నిర్వహిస్తున్న శ్రీవిద్యా నికేతన్ మాత్రం మన తెలుగు రాష్ట్రాలలో అత్యన్నతమైన విద్య సంస్థగా పేరు తెచ్చుకోవడమే కాకుండా ఈ విద్య సంస్థలో ఎందరో పేద విద్యార్దులు కుల మతాలకు అతీతంగా చదువుకుంటున్నారు. 

ఇప్పుడు చిరంజీవి దృష్టి మోహన్ బాబు నిర్వహిస్తున్న విధ్యా సంస్థల పై పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేక వ్యాపారాలలో ప్రత్యక్ష పరోక్ష ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న చిరంజీవి త్వరలో చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరిట మన ఇరు రాష్ట్రాలలో చాల చోట్ల విధ్యా సంస్థలు స్థాపించే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. 

ఈ ప్రయత్నాలలో భాగంగా ముందుగా శ్రీకాకుళంలో చిరంజీవి ఇంటర్ నేషనల్ స్కూల్ ను స్థాపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. IGCSE మరియు CBSE సిలబస్ లతో అత్యంత నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఈ స్కూల్ ఈ విధ్యా సంవత్సరం నుండి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. చిరంజీవి ఈ విధ్యా సంస్థకు ఫౌండర్ గా వ్యవహరిస్తే వ్యవస్తాపక చైర్మన్ గా నాగబాబు ఈ విధ్యా సంస్థల అధ్యక్షుడుగా చరణ్ వ్యవహరిస్తారని వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు ఈ విధ్యా సంస్థలకు కార్యదర్శిగా మెగా కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన స్వామి నాయుడు వ్యవహరిస్తాడని టాక్. ఈ విధ్యా సంస్థ ద్వారా రానున్న సంవత్సరాలలో అనేక చోట్ల స్కూల్స్ కాలేజీలు కూడ ఏర్పాటు చేసే ఆలోచనలలో మెగా కాంపౌండ్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు మెగా అభిమానుల కుటుంబాలకు చెందిన పిల్లలకు ఈ విధ్యా సంస్థలో ఫీజుల విషయంలో రాయతీలు ఇవ్వబోతున్నట్లు సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: